; మరియు ఇలా అన్నారు: “మొక్కుకోవడం ఏ మంచినీ, శుభాన్నీ తీసుకొని రాదు, అది కేవలం పిసినారి నుండి ఎంతో కొంత బయటకు తీసే…

; మరియు ఇలా అన్నారు: “మొక్కుకోవడం ఏ మంచినీ, శుభాన్నీ తీసుకొని రాదు, అది కేవలం పిసినారి నుండి ఎంతో కొంత బయటకు తీసే మార్గము మాత్రమే.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “(ఏ విషయం కొరకైనా) మొక్కుకోవడాన్ని (మొక్కుబడులను) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు; మరియు ఇలా అన్నారు: “మొక్కుకోవడం ఏ మంచినీ, శుభాన్నీ తీసుకొని రాదు, అది కేవలం పిసినారి నుండి ఎంతో కొంత బయటకు తీసే మార్గము మాత్రమే.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయం గురించైనా మొక్కుకోవడాన్ని నిషేధించినారు. మొక్కుకొనుట అంటే ఒక వ్యక్తి, షరియత్ ప్రధాత అయిన అల్లాహ్ ద్వారా అతనిపై ‘విధి’ చేయబడని విషయాన్ని తనపై విధిగావించుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మొక్కుబడులు (విధిలిఖితమైన) ఏ విషయాన్నీ ముందుకు జరుపలేవు, అలాగే వెనుకకూ జరుపలేవు. అవి, తనపై విధిగావించబడిన వాటిని తప్ప (స్వచ్ఛంద ఆరాధనలు) ఏవీ చేయని పిసినారి నుండి నిశ్చయంగా ఎంతో కొంత బయటకు తీయగలవు. మొక్కుబడులు అతని విధివ్రాతలో లేని ఏ విషయాన్నీ అతని కొరకు తీసుకుని రాలేవు.”

فوائد الحديث

మొక్కుకొనుట అనేది షరియత్’లో తప్పనిసరి చేయబడలేదు. కానీ ఎవరైనా దేని కొరకైనా మొక్కుకున్నట్లయితే, అది పాపపు పని కానంతవరకూ, ఆ మొక్కుబడిని తప్పనిసరిగా తీర్చవలసి ఉంటుంది.

మొక్కుకోవడాన్ని నిషేధించుటకు కారణం: (అది ఏ మంచినీ, శుభాన్నీ తీసుకుని రాదు): ఎందుకంటే అది అల్లాహ్ ఆదేశించిన ఏ విషయాన్నీ వెనుదిరిగేలా చేయలేదు. అందుకని మొక్కుకునే వ్యక్తి తాను మొక్కుకున్న కారణంగా తన కోరిక నెరవేరిందని అనుకోరాదు. ఎందుకంటే సర్వోన్నతుడైన అల్లాహ్ స్వయం సమృద్ధుడు, ఏ అక్కరాలేనివాడు, ఎవరి అక్కరా లేని వాడు.

ఇమాం ఖుర్తుబీ ఇలా అన్నారు: “ఈ నిషేధం ఎవరికి వర్తిస్తుందంటే; ఉదాహరణకు ఒక వ్యక్తి ఇలా అనడం: “జబ్బుపడిన నా ఫలానా బంధువుని అల్లాహ్ నయం చేస్తే, నేను ఫలానా ఫలానాది దానం చేస్తాను” అని. నిజానికి దాతృత్వపు పని ఏదైనా అది ఒక మంచి ఆరాధనే. మొక్కుకోవడం పట్ల అయిష్టతకు కారణం ఏమిటంటే – ఆ దాతృత్వపు మంచి పనిని, తాను మొక్కున్న పని జరగడంపై ఆధారపడేలా చేసాడు. దీని ద్వారా ప్రస్ఫుటమవుతున్న విషయం ఏమిటంటే అతని సంకల్పము తాను చేసే మంచి పనుల ద్వారా అల్లాహ్ కు చేరువ కావడం కాదు, బదులుగా, అతను పరిహారం మార్గాన్ని ఎంచుకున్నాడు (నువ్వు నాకు ఇది చేసిపెడితే, నేను అది చేస్తాను, అనేలా). ఒకవేళ జబ్బు పడి ఉన్న అతని మనిషికి నయం కాకపోతే, ఆ షరతుపై ఆధారపడేలా చేసిన దాతృత్వపు మంచి పనిని (అతడు చేయగలిగే సామర్ధ్యం ఉండీ కూడా) చేయడు. ఇది అసలు పిసినారితనం. ఆ పిసినారి యొక్క వాస్తవం. పిసినారి తను ఖర్చుపెట్టే దానికి బదులుగా తక్షణ లాభం ఏమైనా ఉంటే తప్ప తన ధనం నుండి ఖర్చు చేయడు; ఆ లాభం సాధారణంగా అతడు చేసే ఖర్చుకంటే ఎక్కువ ఉంటుంది.

التصنيفات

ప్రమాణాలు మరియు మొక్కుబడులు