“మీరు నిశ్చయంగా మీకంటే పూర్వం గతించిన వారి విధానాలను అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు (అంచెలంచెలుగా…

“మీరు నిశ్చయంగా మీకంటే పూర్వం గతించిన వారి విధానాలను అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు (అంచెలంచెలుగా అనుసరిస్తారు)

అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు నిశ్చయంగా మీకంటే పూర్వం గతించిన వారి విధానాలను అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు (అంచెలంచెలుగా అనుసరిస్తారు) – ఎంతగా అంటే, ఒకవేళ వారు ఏదైనా ఉడుము రంధ్రములోనికి దూరితే, అందులోనూ మీరు వారిని అనుసరిస్తారు”; మేము “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! (మాకంటే పూర్వం గతించిన వారంటే ఎవరు?) యూదులూ మరియు క్రైస్తవులా?” అని ప్రశ్నించాము. దానికి ఆయన “మరి వారు కాక ఇంకెవరు?” అన్నారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానంతరం తన జాతిలోని (ఉమ్మత్ లోని) కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతున్నారు. వీరు యూదులు మరియు క్రైస్తవుల విశ్వాసాలు, ఆచారాలు, ఆచరణలు, మరియు సంప్రదాయాలలో వారి మార్గాన్ని, అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు; ఎంతగా అంటే వారు (యూదులు, క్రైస్తవులు) ఒకవేళ ఏదైనా ఉడుం రంధ్రములోనికి దూరితే, వీరు కూడా వాళ్ళ వెనుక అందులోనికి దూరతారు.

فوائد الحديث

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన భవిష్యవాణి; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వానికి నిదర్శనం. ‘ఇలా జరుగుతుంది’ అని ఆయన తన జీవితకాలములోనే తెలియజేసారు. ప్రస్తుతం ఆయన చెప్పినట్లుగానే జరుగుతూ ఉండడం చూస్తున్నాం మనం.

విశ్వాసులు, అవిశ్వాసులను వారి విశ్వాసాలలో గానీ, లేక వారి ఆరాధనా విధానాలలో గానీ, వారి పండుగలు పర్వదినాలలో గానీ, లేక వారికి మాత్రమే ప్రత్యేకమైన వారి వస్త్రాలు, వస్త్రధారణ విధానాలలో గానీ వారిని అనుసరించుట నిషేధము.

అధ్యాత్మిక విషయాలను స్పష్టమైన ఉదాహరణలతో వివరించడం ఇస్లాంలోని బోధనా విధానాలలో ఒకటి.

"అల్-దబ్": ఇది ఒక జంతువు, దీని బొరియ చాలా చీకటిగా మరియు దుర్వాసనతో ఉంటుంది. ఇది ఎడారులలో అధికంగా ఉండే సరీసృపాలలో ఒకటి. ఈ హదీథులో ‘అల్-దబ్’ యొక్క బొరియను పేర్కొనడానికి కారణం అది చాలా చాలా ఇరుకుగా ఉంటుంది మరియు దుర్వాసనతో కూడి పేలవమైన, అసహ్యమైన స్థితిలో ఉంటుంది. కొంతమంది ముస్లింలు, యూదులు మరియు క్రైస్తవుల జాడలు మరియు మార్గాలను గుడ్డిగా అనుసరిస్తారు కాబట్టి, వారు ఇంత ఇరుకైన మరియు అసహ్యకరమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఈ ముస్లింలు వారితో ఏకీభవిస్తారు మరియు వారిని అనుసరిస్తారు. అల్లాహ్ యొక్క సహాయమే రక్షణకు మూలం.

التصنيفات

నిషేధించబడిన అనురూప్యము (పోలిక)