“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు…

“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు అల్లాహ్ రమజాన్ నెల ఉపవాసములు ఆచరించుటను విధిగావించినాడనే విషయాన్ని విశ్వసిస్తూ; ఉపవాసములు పాటించే వారి కొరకు అల్లాహ్ తన అంతులేని ఖజానాల నుండి సిధ్ధం చేసి ఉంచిన పారితోషికం, ప్రతిఫలం మరియు పుణ్యఫలముల నందు విశ్వసిస్తూ; ప్రదర్శనా బుధ్ధితో గాక లేదా పేరు ప్రతిష్టల కొరకు గాక, కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే సంకల్పించి, రమజాన్ నెల ఉపవాసములు ఆచరిస్తారో అటువంటి వారి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.

فوائد الحديث

ఇందులో – రమజాన్ నెల ఉపవాసములు పాటించేటప్పుడు, అలాగే ఇతర సత్కార్యములు ఆచరించేటప్పుడు, తన సంకల్పములో కలిగి ఉండే స్వచ్చత మరియు నిజాయితీల ఘనత మరియు ప్రాధాన్యత తెలుస్తున్నది.

التصنيفات

ఉపవాసాల ఘనత