“మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”

“మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు – ఒక ముస్లిం, తాను తన స్వయం కొరకు దేనినైతే (ఏఏ విషయాలనైతే) ఇష్టపడతాడో, దానినే (ఆ విషయాలనే) తన సహోదరుని కొరకు కూడా ఇష్టపడనంతవరకు – తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. అంటే ఉదాహరణకు: అల్లాహ్’కు విధేయత చూపే ఆచరణలలో, ధార్మిక జీవనానికి సంబంధించి మరియు ప్రాపంచిక జీవనానికి సంబంధించి వివిధ రకాల సత్కార్యాలు చేయుట – మొదలైన వాటిలో తన కొరకు ఏమైతే ఇష్టపడతాడో, తన సోదరుని కొరకు కూడా దానినే ఇష్టపడనంత వరకు; అలాగే తన స్వయం కొరకు దేనినైతే అసహ్యించుకుంటాడో, ఇష్టపడడో, తన సోదరుని కొరకు కూడా దానిని ఇష్టపడనంత వరకు తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. ఒకవేళ అతడు తన సోదరునిలో – ధార్మిక విషయాలలో అంటే అల్లాహ్’కు విధేయత చూపుటలో ఏమైనా లోపాలు, కొరత గమనించినట్లయితే అతడు ఆ లోపాలను, కొరతను తొలగించడానికి పాటుపడతాడు; తన సోదరునిలో ఏమైనా మంచిని గమనించినట్లయితే అతడిని ప్రోత్సహిస్తాడు, మార్గదర్శకం చేస్తాడు; ధార్మిక జీవనానికి, ప్రాపంచిక జీవనానినికి సంబంధించిన విషయాలలో అతనికి మంచి సలహాలు ఇస్తాడు.

فوائد الحديث

ఒక ముస్లిం తన కొరకు దేనినైతే ఇష్ట పడతాడో, దానినే తన సహోదరుని కొరకు కూడా ఇష్టపడుట విధి (వాజిబ్). అలా చేయకపోతే అతని విశ్వాసం నిరాకరించబడడం అనేది ఆ విషయాన్ని వాజిబ్ చేస్తున్నది.

ధర్మములో సహోదరత్వం (ఒక ముస్లిం మరొక ముస్లిమునకు ధార్మిక సహోదరుడు) అనేది, రక్తసంబంధ సహోదరత్వం కంటే కూడా పైస్థాయి కలిగి ఉన్నది. కనుక దాని హక్కు చెల్లించుట మరింతగా విధి (వాజిబ్) అవుతుంది.

ఈ ప్రేమకు విరుద్ధమైన అన్ని మాటలు మరియు చర్యలను నిషేధించడం, వాటికి దూరంగా ఉండడం ముఖ్యం; అంటే ఉదాహరణకు: మోసం చేయడం, దూషించడం, అసూయ మరియు వ్యక్తిగతంగా ఒక ముస్లింనకు, అతని సంపదకు లేదా అతని గౌరవానికి వ్యతిరేకంగా దాడి చేయడం వంటివి, వీటికి దూరంగా ఉండాలి.

తరుచూ “నా సోదరుని కొరకు” అనే లాంటి మాటలు ఉపయోగించడం, ఆ దిశలో ఆచరణను ప్రోత్సహిస్తుంది.

అల్ కిర్మానీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఒక ముస్లిం తన కొరకు కీడును ఏ విధంగానైతే అసహ్యించుకుంటాడో, ఇష్టపడడో, అదే విధంగా తన సోదరుని కొరకు కూడా అయిష్ట పడుట విశ్వాసములోని భాగమే - అతడు దానిని వ్యక్తపరచకపోయినా సరే. ఎందుకంటే తన సోదరుని కొరకు ఒక విషయాన్ని ఇష్టపడుట అంటే, దానికి వ్యతిరేకమైన దానిని అసహ్యించుకొనుట కూడా కావాలి. కనుక ఆ అయిష్టమైన విషయాలను పూర్తిగా వదిలివేయుటతో అది సరిపోతుంది.

التصنيفات

సద్గుణాలు