“ ‘గీబత్’ (చాడీలు చెప్పుట, వ్యక్తి పరోక్షములో అతని గురించి మాట్లాడుట) అంటే ఏమిటో తెలుసా మీకు?” ఆయన సహాబాలు…

“ ‘గీబత్’ (చాడీలు చెప్పుట, వ్యక్తి పరోక్షములో అతని గురించి మాట్లాడుట) అంటే ఏమిటో తెలుసా మీకు?” ఆయన సహాబాలు “అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. ఆయన “(‘గీబత్’ అంటే) మీ సోదరుని గురించి అతడు ఇష్టపడని విధంగా మాట్లాడడం”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ ‘గీబత్’ (చాడీలు చెప్పుట, వ్యక్తి పరోక్షములో అతని గురించి మాట్లాడుట) అంటే ఏమిటో తెలుసా మీకు?” ఆయన సహాబాలు “అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. ఆయన “(‘గీబత్’ అంటే) మీ సోదరుని గురించి అతడు ఇష్టపడని విధంగా మాట్లాడడం” అన్నారు. వారిలో ఒకరు “నా సోదరుని గురించి నేను చెబుతున్నది నిజమే అయితే? దాని గురించి మీరు ఏమంటారు?” అని అడిగారు. దానికి ఆయన “నీ సోదరుని గురించి నీవు చెబుతున్నది ఒకవేళ నిజమే అయితే, నీవు అతడి గురించి “గీబత్’ చేసావు, ఒకవేళ నిజం కాకపోతే నీవు అతడిపై అపనింద వేసావు” అన్నారు”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించబడిన గీబత్’ యొక్క వాస్తవికతను గురించి వివరిస్తున్నారు. అదేమిటంటే అక్కడ హాజరుగా లేని ఒక ముస్లిమును గురించి అతడు ఇష్టపడని విధంగా చెప్పుట, మాట్లాడుట; అది అతడి భౌతిక రూపాన్ని గురించి కానివ్వండి లేక అతడి నైతిక గుణగణాలను గురించి కానివ్వండి. ఉదాహరణకు: ‘ఆ ఒంటికన్ను మోసగాడా!’, ‘ఆ అబద్దాలకోరా!’ లేక ఇంకా ఇలాంటి వర్ణనలు, గుణగణాలతో కూడిన మాటలతో అతడి గురించి మాట్లాడుట, చెప్పుట అని అర్థము. ఆ భౌతిక వర్ణనలు, ఆ గుణగణాలు అతడిలో నిజంగానే ఉన్నప్పటికీ. ఒకవేళ ఆ భౌతిక వర్ణనలు, ఆ గుణగణాలు అతడిలో లేకపోయినట్లయితే అది ‘గీబత్’ కంటే ఇంకా ఘోరమైన విషయం అవుతుంది. అది అతడిపై అపనింద వెయ్యడం అవుతుంది – అంటే అతడు ఆ విధమైన వ్యక్తి కాకపోయినప్పటికీ, అతనిలో ఆ లక్షణాలు లేక పోయినప్పటికీ అతడి గురించి ఆ విధంగా మాట్లాడడం. అది ఇంకా ఘోరమైన విషయం.

فوائد الحديث

ఇందులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనా విధానానికి సంబంధించి ఒక మంచి ఉదాహరణ మనకు కనిపిస్తుంది. అది ముందుగా ప్రశ్నించి, వారిలో కుతూహలాన్ని రేకెత్తించి, దానిని గురించి వివరించడం.

అలాగే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించినపుడు ‘అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు’ అని జవాబివ్వడంలో, సహబాలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పై చూపుతున్న గౌరవానికి, సభ్యతకు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వారి ప్రవర్తనకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

ఎవరి నుంచిైనా ప్రశ్న ఎదురైతే, ప్రశ్నించబడిన వ్యక్తికి సమాధానం తెలియకపోతే: ‘అల్లాహు ఆ’లము’ (అల్లాహ్ యే బాగా ఎరుగును) అని పలకాలి.

సమాజంలో షరియత్ చట్టాన్ని స్థాపించుట (మరియు వ్యవహారాలను దాని ప్రకారం) నిర్వహించుట వలన, సమాజంలో వ్యక్తుల హక్కుల రక్షణ జరిగుతుంది మరియు వారి మధ్య సహోదరత్వం బలపడుతుంది.

సమాజ శ్రేయస్సు కొరకు, కొన్ని సందర్భాలలో తప్ప, ‘గీబత్’ (వ్యక్తి పరోక్షంలో అతడు ఇష్టపడని విధంగా అతని గురించి మాట్లాడుట) నిషేధించబడింది. ‘కొన్ని సందర్భాలు’ అంటే, ఉదాహరణకు దౌర్జన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుట. తనపై దౌర్జన్యం జరిగిన వ్యక్తి, ‘దౌర్జన్యకారుడి నుంచి తన హక్కును ఇప్పించగలడు’ అనే సమర్థత, స్థోమత ఉన్న వ్యక్తి ఎదుట ఆ దౌర్జన్యకారుని గురించి మాట్లాడుట. ఇది సమంజసమే. ఉదాహరణకు: ‘ఫలానా వాడు నాపై దౌర్జన్యం చేసాడు’ ‘ఫలానా వాడు నన్ను ఈ విధంగా హింసించాడు’ అని వాని చెడు గురించి మాట్లాడడం. ఇటువంటి మరికొన్ని సందర్భాలకు ఉదాహరణలు: పెళ్ళి సంబంధాలు చూస్తున్న సందర్భాలలో వ్యక్తులను గురించి తెలిసిన నిజాలు చెప్పడం, వ్యాపారాలలో ‘భాగస్వామ్యములు’ కుదుర్చుకునే సందర్భాలలో వారిని గురించి తెలిసిన నిజాలు చెప్పడం, మొదలైనవి.

التصنيفات

మాట్లాడే మరియు మౌనంగా ఉండే పద్దతులు