“’సజ్దా’ (సాష్టాంగ ప్రమాణము) చేసినపుడు (ఆ స్థితిలో) దాసుడు తన ప్రభువుకు అతి చేరువగా ఉంటాడు. కనుక ‘సజ్దా’…

“’సజ్దా’ (సాష్టాంగ ప్రమాణము) చేసినపుడు (ఆ స్థితిలో) దాసుడు తన ప్రభువుకు అతి చేరువగా ఉంటాడు. కనుక ‘సజ్దా’ స్థితిలో మరింత ఎక్కువగా ఆయనను వేడుకొనండి”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “’సజ్దా’ (సాష్టాంగ ప్రమాణము) చేసినపుడు (ఆ స్థితిలో) దాసుడు తన ప్రభువుకు అతి చేరువగా ఉంటాడు. కనుక ‘సజ్దా’ స్థితిలో మరింత ఎక్కువగా ఆయనను వేడుకొనండి”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా చేసినపుడు దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉంటాడు అని; అలాగే, దాసుడు అల్లాహ్ కు విధేయత చూపుతూ అణకువతో, వినమ్రతతో తన శరీరంలోని సమున్నతమైన తల భాగాన్ని నేలకు ఆనించి ‘సజ్దా’ చేస్తాడు అని తెలియజేస్తున్నారు. సజ్దా స్థితిలో అల్లాహ్’ను మరింత ఎక్కువగా వేడుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు, సజ్దా చేయుటలో దాసుడు చూపే విధేయత, వినమ్రత, అణకువ అతడి వేడుకోలుతో మమేకం కావాలి.

فوائد الحديث

విధేయత, వినమ్రత, అణకువ – ఇవి దాసుడిని, పరమ పవిత్రుడు, మహోన్నతుడూ అయిన అల్లాహ్’కు చేరువ చేస్తాయి.

ఇందులో, సజ్దా స్థితిలో మరింత ఎక్కువగా వేడుకొనుట గురించి ప్రోత్సాహం కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రార్థనలకు సమాధానం లభించే స్థానములలో అది ఒకటి.

التصنيفات

దుఆ స్వీకరింపబడటానికి మరియు దాని నుండి ఆటంకములకు కారణాలు