“(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా…

“(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్” (ఓ అల్లాహ్! మా ప్రభువా! ఈ ప్రపంచములో మాకు మంచిని కలుగజేయుము, మరియు పరలోకమునందును మాకు మంచిని కలుగజేయుము, మరియు నరకాగ్ని నుండి మమ్ములను రక్షింపుము.”

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్” (ఓ అల్లాహ్! మా ప్రభువా! ఈ ప్రపంచములో మాకు మంచిని కలుగజేయుము, మరియు పరలోకమునందును మాకు మంచిని కలుగజేయుము, మరియు నరకాగ్ని నుండి మమ్ములను రక్షింపుము.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక దుఆలు చేసేవారు; వాటిలో ఈ దుఆ కూడా ఒకటి: “అల్లాహుమ్మ, రబ్బనా, ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్”(ఓ మా ప్రభువా మాకు ఇహలోకములో మంచిని,పరలోకములో మంచిని ప్రసాధించు మరియు మమ్మల్ని నరక శిక్ష నుండి రక్షించు.) ఈ ప్రార్థనలో, ఈ లోకంలో ఉన్న మంచి విషయాలు ప్రసాదించమనే అభ్యర్థన ఉన్నది, ఉదాహరణకు: ఆమోద యోగ్యమైన, విస్తారమైన మరియు చట్టబద్ధమైన (హలాల్) సంపాదన; ధార్మికురాలైన జీవిత భాగస్వామి, కనులకు చలువను చేకూర్చే సంతానము, జీవితములో ఉపశమనము, ప్రయోజనకరమైన జ్ఞానం, ఉత్తమమైన ఆచరణలు, ఇంకా జీవితానికి అవసరమైన మరియు అనుమతించబడిన ఇటువంటి అనేక ఇతర విషయాలు; అలాగే పరలోకములోనూ మంచిని ప్రసాదించమనే అభ్యర్థన ఉన్నది, ఉదాహరణకు: సమాధి శిక్షనుండి సురక్షితంగా ఉండుట, తీర్పు దినము నాడు నిలబడి ఉండు స్థితి నుండి సురక్షితంగా ఉండుట, మరియు నరకాగ్ని నుండి సురక్షితంగా ఉండుట; అలాగే అల్లాహ్ యొక్క ప్రసన్నతను, ఆయనకు ఇష్ఠులయ్యే భాగ్యాన్ని పొందుట; తీర్పు దినమునాడు సాఫల్యవంతులగుట; శాశ్వతమైన సుఖసంతోషాలతో అనంత కరుణామయుడైన ఆ ప్రభువు యొక్క సాన్నిహిత్యాన్ని పొందుట మొదలైనవన్ని.

فوائد الحديث

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి ఉదాహరణను ను అనుసరించి సమగ్రమైన దుఆ (ప్రార్థన, వేడుకోలు) చేయడం అభిలషణీయం.

ఒక వ్యక్తి తన ప్రార్థనలో (దుఆలో) ఈ లోకానికి చెందిన మంచిని మరియు పరలోకానికి చెందిన మంచిని కలిపి దుఆ చేస్తే అది అతని కొరకు మరింత పరిపూర్ణమైన దుఆ అవుతుంది.

التصنيفات

మాసూర్ దుఆలు