నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్…

నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ముక్కుమీద మట్టి కొట్టుకు పోవుగాక! అతడి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నా, వారు అతడిని స్వర్గంలో ప్రవేశింపజేయకపోతే (వారికి సేవలు చేయడం ద్వారా పుణ్యాలు సంపాదించి స్వర్గంలో ప్రవేశం పొందలేకపోయిన), ఆ వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక!

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ముక్కుమీద మట్టి కొట్టుకు పోవుగాక! అతడి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నా, వారు అతడిని స్వర్గంలో ప్రవేశింపజేయకపోతే (వారికి సేవలు చేయడం ద్వారా పుణ్యాలు సంపాదించి స్వర్గంలో ప్రవేశం పొందలేకపోయిన), ఆ వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక!

[దృఢమైనది]

الشرح

పరాభవం, అవమానం, నష్టానికి గురయ్యే మూడు రకాల వ్యక్తులకు వ్యతిరేకంగా వారి ముక్కు మట్టి కొట్టుకు పోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసినారు (అంటే అవమానించబడుగాక). మొదటి రకం వ్యక్తి: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు తన సమక్షంలో ప్రస్తావించబడినప్పుడు, అతడు ఆయనపై దరూద్ పంపని వాడు అంటే కనీసం సల్లల్లాహు అలైహి వసల్లం అని అయినా పలకని వాడు. రెండవ రకం వ్యక్తి: రమదాన్ నెలను పొంది, ఆపై అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం రమదాన్ మాసంలోని ప్రత్యేక ఆరాధనలలో పాల్గొనడం ద్వారా అల్లాహ్ యొక్క క్షమాపణ పొందే అవకాశం ఉన్నా, దాని సద్వినియోగం చేసుకోకుండానే ఆ నెలను పోగొట్టుకున్న వ్యక్తి. మూడవ రకం వ్యక్తి: తన తల్లిదండ్రులు వృద్ధాప్యాన్ని చేరుకున్నప్పటికీ, అతను వారి హక్కులను సరిగ్గా పూర్తి చేయకుండా, వారికి అవిధేయత చూపినందున మరియు వారిని ఉపేక్షించినందున, వారు స్వర్గంలో ప్రవేశింపజేయలేకపోయిన వ్యక్తి.

فوائد الحديث

అస్-సిoదీ ఇలా అన్నారు: అంతిమంగా చెప్పేది ఏమిటంటే, ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం లభించింది, మరియు వారి నిర్లక్ష్యం చేయకుండా ఉండి ఉంటే, వారు సమృద్ధిగా మంచి ప్రతిఫలాన్ని పొంది ఉండేవారు. తమ నిర్లక్ష్యం వలన వారు దానిని కోల్పోయినారు. దానిని కోల్పోయినందున, వారు నిజంగా విఫలమయ్యారు మరియు ఓడిపోయారు.

ప్రవక్త ముహమ్మద్ ﷺ పేరు ప్రస్తావించబడినప్పుడల్లా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై దురూదు పంపడం ప్రోత్సహించబడింది.

రమదాన్ మాసంలో వీలైనంత ఎక్కువగా కృషి చేస్తూ, ఉత్సాహంగా, పట్టుదలతో స్థరంగా ఆరాధనలలో పాల్గొనాలని, (తమ తప్పులు, పాపాలను మన్నించి, నరకాగ్ని నుండి కాపాడమని అల్లాహ్ ను ప్రాధేయపడాలని) ప్రోత్సహించబడింది.

తల్లిదండ్రుల పట్ల కర్తవ్యాన్ని పూర్తి చేస్తూ, ప్రత్యేకించి వారి వృద్ధాప్యంలో సగౌరవంగా సేవలు చేయడంలో శ్రద్ధ వహించాలని ప్రోత్సహించబడింది.

التصنيفات

సాధారణ విషయాల దుఆలు