“ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో…

“ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”

ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు. ఏ ముస్లిమ్ అయినా కూడా ఫర్జ్ నమాజు చేసే సమయం ప్రవేశించినపుడు, ఉత్తమంగా ఉదూ ఆచరించి దానిని పరిపూర్ణం చేస్తాడు; తరువాత తన హృదయాన్నీ, తన దేహాన్నీ అల్లాహ్ వైపునము మరల్చి, అణకువ, వినయం కలిగి తనను తాను పూర్తిగా సమర్పించుకున్న రీతిలో అల్లాహ్ యొక్క ఘనతను, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుతూ, రుకూ మరియు సజ్దాలను పరిపూర్ణంగా ఆచరిస్తూ సలాహ్ ను (నమాజును) ఆచరిస్తాడు, అది అంతకు ముందు వరకు అతని వల్ల జరిగిన చిన్న పాపాలకు పరిహారంగా పరిణమిస్తుంది; అతడు పెద్ద పాపాలకు పాల్బడనంత వరకు. ఈ ఘనత కాలానుగతంగా ప్రతి సలాహ్ కు వర్తిస్తుంది.

فوائد الحديث

పాపాలకు పరిహారంగా పరిణమించే నమాజు (సలాహ్) ఏదంటే – దాసుడు ఉత్తమంగా వుదూ ఆచరించి, వినయము, అనకువలతో, గర్వము లేకుండా, కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మాత్రమే ఆచరించబడే నమాజు.

ఆరాధనలో నిలకడ కలిగి ఉండటం యొక్క ఘనతను, పుణ్యమును ఇందులో చూడవచ్చు, మరియు అది చిన్న పాపాలు క్షమించబడటానికి కారణం అవుతుంది.

వుజూ ను ఉత్తమంగా ఆచరించడం, మరియు సలాహ్’ను వినయము, అణకువ కలిగి ఆచరించడం యొక్క ఘనత తెలుస్తున్నది.

మన ద్వారా జరిగే చిన్న పాపాలు తుడిచివేయబడడానికి పెద్ద పాపాలకు దూరంగా ఉండడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.

పెద్ద పాపాలు ప్రాయశ్చిత్తముతో తప్ప పరిహరించబడవు.

التصنيفات

నమాజు ప్రాముఖ్యత