“ప్రజలలో రెండు విషయాలు ‘కుఫ్ర్’ (అవిశ్వాసము) యొక్క చిహ్నాలుగా ఉన్నాయి - వంశావళిని కించపరచడం, ఎవరైనా…

“ప్రజలలో రెండు విషయాలు ‘కుఫ్ర్’ (అవిశ్వాసము) యొక్క చిహ్నాలుగా ఉన్నాయి - వంశావళిని కించపరచడం, ఎవరైనా చనిపోయినపుడు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రజలలో రెండు విషయాలు ‘కుఫ్ర్’ (అవిశ్వాసము) యొక్క చిహ్నాలుగా ఉన్నాయి - వంశావళిని కించపరచడం, ఎవరైనా చనిపోయినపుడు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: అవిశ్వాసపు ఆచరణలు అనదగిన ఒక ఆచరణను గురించి, మరియు అఙ్ఞాన కాలపు సంప్రదాయాలలో ఒక దానిని గురించి (రెండు విషయాల గురించి) ఇలా తెలియజేస్తున్నారు: అవి: మొదటిది: ప్రజల వంశావళిని కించపరుస్తున్నట్లుగా మాట్లాడడం; అవమానించడం, వారిని కించపరచడం మరియు వారి పట్ల గర్వంగా ప్రవర్తించడం. రెండవది: ఏదైనా విపత్తు సంభవించినపుడు స్వరాన్ని పెంచి “ఖద్ర్” (విధివ్రాత) పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, తీవ్రమైన అసంతృప్తితో బట్టలు చింపుకోవడం.

فوائد الحديث

ఈ హదీథులొ వినయంతో ఉండాలనే, ప్రజల పట్ల అహంకారం చూపరాదనే హితబోధ ఉన్నది.

ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు అసంతృప్తి చెందకుండా సహనం వహించడం విధి (వాజిబ్).

ఈ పనులు “అల్ కుఫ్ర్ అస్’సఘీర్” (చిన్న కుఫ్ర్ – చిన్న అవిశ్వాసం) అనబడతాయి. కుఫ్ర్ యొక్క లక్షణాలలో ఒకదానిని కలిగి ఉన్నవాడు “కాఫిర్” (అవిశ్వాసి) అయిపోడు. “అల్ కుఫ్ర్ అల్ అక్బర్” (పెద్ద కుఫ్ర్ విషయాలు) విషయాలలో దేనికైనా పాల్బడనంత వరకు అతడు కాఫిర్ (అవిశ్వాసి) అయిపోడు.

ముస్లింల మధ్య విభజనకు దారితీసే అన్ని విషయాలను ఇస్లాం నిషేధిస్తుంది, ఉదాహరణకు: వంశపారంపర్యంపై దాడి మరియు ఇతర విషయాలు వంటివి.

التصنيفات

అవిశ్వాసం (కుఫ్ర్)