ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ…

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ జరిగింది

అబుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ జరిగింది. తరువాత మక్కాలో పదమూడు సంవత్సరాలు నివసించినారు. తరువాత వలస వెళ్ళమని (అల్లాహ్ చే) ఆదేశించబడినారు. ఆయన మదీనా కు వలస వెళ్ళినారు. అక్కడ పది సంవత్సరాలు గడిపినారు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమవదించినారు”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా తెలియ జేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దివ్య (ఖుర్’ఆన్) అవతరణ జరిగింది. అది వారు నలభై సంవత్సరాల వయసులో ఉండగా మొదలైంది. అవతరణ మొదలైన తరువాత వారు మక్కాలో పదమూడు సంవత్సరాలు నివసించినారు. అపుడు మదీనాకు వలస వెళ్ళమని ఆదేశించబడినారు. అక్కడ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పది సంవత్సరాలు గడిపినారు. తరువాత వారు అరవై మూడు సంవత్సరాల వయసులో పరమవదించినారు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర పట్ల సహబాల శ్రధ్ధ తెలుస్తున్నది.

التصنيفات

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవప్రవక్త జీవిత చరిత్ర