“(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “రబ్బిగ్'ఫిర్లీ, రబ్బిగ్’ఫిర్లీ” (ఓ…

“(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “రబ్బిగ్'ఫిర్లీ, రబ్బిగ్’ఫిర్లీ” (ఓ నా ప్రభూ! నన్ను మన్నించు, ఓ నా ప్రభూ! నన్ను క్షమించు)

హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “రబ్బిగ్'ఫిర్లీ, రబ్బిగ్’ఫిర్లీ” (ఓ నా ప్రభూ! నన్ను మన్నించు, ఓ నా ప్రభూ! నన్ను క్షమించు)

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసు ద్వారా, నమాజులో రెండు సజ్దాల నడుమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “రబ్బిగ్’ఫిర్లీ, రబ్బిగ్’ఫిర్లీ” అని పలికేవారని తెలుస్తున్నది. “రబ్బిగ్’ఫిర్లీ” (ఓ నా ప్రభూ! నన్ను క్షమించు) అంటే దాని అర్థము, దాసుడు తన ప్రభువును తన పాపాలను తుడిచి వేయమని, తన తప్పులను కప్పి ఉంచమని అర్థిస్తున్నాడు అని.

فوائد الحديث

ప్రతి ఫర్జ్ నమాజు, ప్రతి సున్నత్ నమాజు మరియు నఫీల్ నమాజులో రెండు సజ్దాల నడుమ ఈ దుఆ పఠించుట షరియత్ ప్రకారం సమ్మతించబడిన విషయం.

నమాజులో రెండు సజ్దాల నడుమ ఈ దుఆను పలుమార్లు పలుకుట మంచిది (అభిలకషణీయమైన విషయం), అయితే కనీసం ఒక్కసారి పలుకుట విధి.

التصنيفات

నమాజ్ పద్దతి