“బహిష్ఠు స్థితి సాధారణంగా ఎంత కాలం కొనసాగుతుందో అన్ని రోజులు వేచి ఉండు. తరువాత గుసుల్ చేయి”

“బహిష్ఠు స్థితి సాధారణంగా ఎంత కాలం కొనసాగుతుందో అన్ని రోజులు వేచి ఉండు. తరువాత గుసుల్ చేయి”

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ ఔఫ్ రజియల్లాహు అన్హు భార్య అయిన ఉమ్మె హబీబహ్ బింత్ జహ్ష్ రజియల్లాహు అన్హా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక సమస్యతో వచ్చి (బహిష్ఠు స్థితిలో వచ్చే) రక్తాన్ని గురించి ప్రశ్నించింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: “బహిష్ఠు స్థితి సాధారణంగా ఎంత కాలం కొనసాగుతుందో అన్ని రోజులు వేచి ఉండు. తరువాత గుసుల్ చేయి”. అయితే ఆమె ప్రతి సలాహ్ (నమాజు)కు ముందు స్నానం చేసేవారు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సహచరులలో ఒక మహిళ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి (బహిష్ఠు స్థితికి సంబంధించి) నిరంతరం రక్తస్రావం అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ కొత్త పరిస్థితి ఎదురు కాకముందు, బహిష్ఠు స్థితి, ఆమెను సలాహ్ (నమాజు) ఆచరించకుండా ఎంతకాలం ఆపి ఉంచేదో, అంత కాలం వేచి ఉండి తరువాత గుసుల్ చేసి నమాజు ఆచరించమని ఆదేశించినారు. అయితే ఆమె స్వచ్ఛందంగా ప్రతి సలాహ్ కు ముందు స్నానం చేసేవారు.

فوائد الحديث

‘ఇస్తిహాజహ్’: అంటే ఒక స్త్రీ తన సాధారణ ఋతు కాలం ముగిసిన తర్వాత (యోని నుండి) నిరంతర రక్త ప్రవాహాం జరుగుతూ ఉండడం.

ఇస్తిహాజా అనుభవిస్తున్న ఒక మహిళ, ఇస్తిహాజా స్థితి ప్రారంభం కావడానికి ముందు, తన ఋతుస్రావం సాధారణంగా ఎన్ని రోజులు కొనసాగుతూ ఉండేదో, అన్ని రోజుల వరకు తను బహిష్ఠు స్థితిలో ఉన్నట్లుగానే భావించాలి.

ఆమె అసలు అలవాటుగా వస్తూ ఉన్న బహిష్ఠు దినములు గడిచినట్లయితే, ఆమె ఋతుస్రావం నుండి స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది – తరువాత ఆమె ఇస్తిహాజా రక్తాన్ని కలిగి ఉన్నప్పటికీ - అలవాటుగా వస్తూ ఉన్న బహిష్ఠు దినములు గడిచిన తర్వాత గుస్ల్ చేయాలి.

ఇస్తిహాజాను అనుభవిస్తున్న స్త్రీ ప్రతి ప్రార్థనకు విధిగా స్నానం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే స్త్రీ సహచరురాలు ఉమ్మె హబీబహ్ బింత్ జహ్ష్ రజియల్లాహు అన్హా ఆమె వ్యక్తిగత తర్కం ఆధారంగా ప్రతి సలాహ్ కు ముందు గుసుల్ ఆచరించేవారు. అది విధి అయి ఉంటే, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు స్పష్టం చేసి ఉండేవారు.

ఇస్తిహాజాను అనుభవిస్తున్న స్త్రీ ప్రతి సలాహ్’కు తప్పనిసరిగా వుజూ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఆమె ‘హదస్’ (అశుద్ధత) నిరంతరాయంగా సంభవిస్తూనే ఉంటుంది కనుక, అలాగే ఇదే నియమం మూత్రం ఆపుకోలేని, నిరంతరాయంగా మూత్రపు చుక్కలు వస్తూ ఉండే వ్యక్తికి, లేదా వెనుక భాగము నుండి నిరంతరాయంగా గాలి విడుదల అయ్యే సమస్యతో బాధపడే ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది.

ధర్మపరమైన విషయాలలో సందేహాలు కలిగినపుడు, ఆ విషయాల జ్ఞానం కలిగిన వారిని ప్రశ్నించడం ఉత్తమం. ఈ హదీసులో స్త్రీ సహాబియ్యహ్ రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను తనకు అధిక రక్తస్రావం అవుతుందని ప్రశ్నించడం మనం చూస్తున్నాము.

التصنيفات

ఋతుస్రావం మరియు పురిటి రక్తము మరియు రక్తం కారటం