“(పట్టు వస్త్రాలు ధరించకండి, ఎందుకంటే) ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు ధరిస్తారో, పరలోక జీవితములో వారు దానిని…

“(పట్టు వస్త్రాలు ధరించకండి, ఎందుకంటే) ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు ధరిస్తారో, పరలోక జీవితములో వారు దానిని ధరించలేరు.”

ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(పట్టు వస్త్రాలు ధరించకండి, ఎందుకంటే) ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు ధరిస్తారో, పరలోక జీవితములో వారు దానిని ధరించలేరు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: పురుషులలో ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు వస్త్రాలు ధరిస్తారో, వారు పరలోక జీవితం లో దానిని ధరించలేరు; ఒకవేళ దానికి అతడు పశ్చాత్తాప పడకపోయినట్లయితే, అతడు ఆ విధంగా శిక్షించబడతాడు.

فوائد الحديث

పట్టు వస్త్రాలు అంటే పూర్తిగా శుద్ధమైన, ప్రకృతిసిద్ధమైన పట్టుతో చేయబడిన వస్త్రాలు అని అర్థం. కృత్రిమంగా సృష్టించబడిన పట్టు ఈ హదీథులో చేర్చబడలేదు.

పురుషులు పట్టును ధరించుట నిషేధము (హరాం).

పట్టును ధరించుట నిషేధము అంటే, పట్టు వస్త్రాలు ధరించుట, మరియు వాటిని వ్యాప్తి చెందించుట కూడా ఇందులోనికే వస్తాయి.

పురుషులు తమ దుస్తులలో కొంత పట్టును ధరించడానికి అనుమతి ఉన్నది, కానీ దాని వెడల్పు రెండు నుండి నాలుగు వేళ్లకు మించరాదు, వస్త్రానికి జెండా లాగా, లేదా వస్త్రపు అంచుగా ఉపయోగించ వచ్చు.

التصنيفات

వస్త్రములు ధరించే పద్దతులు