“(అల్లాహ్ ఆజ్ఞ లేకుండా వ్యాపించే) అంటువ్యాధి అనేది లేదు; పక్షులలో అపశకునం లాంటిది ఏమీ లేదు; గుడ్లగూబలోనూ…

“(అల్లాహ్ ఆజ్ఞ లేకుండా వ్యాపించే) అంటువ్యాధి అనేది లేదు; పక్షులలో అపశకునం లాంటిది ఏమీ లేదు; గుడ్లగూబలోనూ అపశకునం ఏమీ లేదు; మరియు సఫర్ మాసములోనూ అపశకునం ఏమీ లేదు. అయితే, కుష్ఠువ్యాధిగ్రస్తుని నుండి దూరంగా ఉండండి, ఏవిధంగానైతే సింహం నుండి మీరు దూరంగా ఉంటారో.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(అల్లాహ్ ఆజ్ఞ లేకుండా వ్యాపించే) అంటువ్యాధి అనేది లేదు; పక్షులలో అపశకునం లాంటిది ఏమీ లేదు; గుడ్లగూబలోనూ అపశకునం ఏమీ లేదు; మరియు సఫర్ మాసములోనూ అపశకునం ఏమీ లేదు. అయితే, కుష్ఠువ్యాధిగ్రస్తుని నుండి దూరంగా ఉండండి, ఏవిధంగానైతే సింహం నుండి మీరు దూరంగా ఉంటారో.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘జాహిలియ్యహ్’ కాలానికి (ఇస్లాం పూర్వ అనఙ్ఞానపు కాలానికి) చెందిన కొన్ని విషయాలకు వ్యతిరేకంగా, మరియు వారికి హెచ్చరికలాగా ఇందులో వివరిస్తున్నారు. ఒక ప్రకటనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటున్నారు “ప్రతి విషయమూ అల్లాహ్ చేతిలో ఉంది, ఆయన ఆఙ్ఞ మరియు శాసనం ద్వారా తప్ప ఏమీ జరుగదు”. జాహిలియ్యహ్ కాలమునాటి కొన్ని విషయాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో పేర్కొన్నారు. అవి: మొదటిది: జాహిలియా ప్రజలు ఏ వ్యాధి అయినా దానంతట అది స్వయంగా ఇతరులకు సంక్రమిస్తుందని భావించేవారు; కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాధిగ్రస్తుడై ఉన్న వ్యక్తి నుండి ఇతరులకు ఆ వ్యాధి తనంతట తనే వ్యాపిస్తుంది అనే నమ్మకాన్ని నిషేధించారు; అల్లాహ్’యే సమస్త విశ్వాన్ని నియంత్రించేవాడు; ఆయనే అనారోగ్యాన్ని పంపుతాడు, మరియు దానిని తొలగించేవాడు కూడా ఆయనే, ఇది అల్లాహ్ యొక్క సంకల్పం మరియు ఆయన పూర్వ నిర్దిష్టము ద్వారా తప్ప జరగదు. రెండవది: జాహిలియ్యహ్ కాలములో ప్రజలు ఏదైనా దూర ప్రయాణముపై గానీ, లేక ఏదైనా వ్యాపారము నిమిత్తము గానీ బయలుదేరడానికి ముందు పక్షులను గాలిలోనికి ఎగురవేసేవారు. ఆ పక్షి కుడివైపునకు మళ్ళితే అది మంచి శకునం అని సంతోషించేవారు. ఒకవేళ అది ఎడమ వైపునకు మళ్లితే అది చెడు శకునంగా భావించి ఆ పనిని చేయకుండా వదిలివేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పక్షులతో శకునం, అపశకునం అనే భావనను నిషేధించినారు. అదంతా మూఢ విశ్వాసము అన్నారు. మూడవది: జాహిలియ్యహ్ కాలములో ప్రజలు – ఒకవేళ గుడ్లగూబ ఎవరి ఇంటిపైన గానీ కూర్చుంటే ఆ ఇంటి వారిపై ఏదో ఒక ఆపద వచ్చి పడుతుందని భావించే వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూఢవిశ్వాసాన్ని కూడా నిషేధించినారు. నాలుగవది: ఇస్లామీయ నెలలలో (చాంద్రమాన మాసములలో) రెండవ మాసమైన ‘సఫర్’ మాసము పట్ల ప్రజలలో ప్రబలి ఉన్న మూఢనమ్మకాలను కూడా నిషేధించినారు. సఫర్ మాసము ఒక పాము వంటిదని, అది మనుషులు మరియు పశువుల కడుపులలో నివసిస్తూ ఉంటుందని. అది ‘గజ్జి’ కన్నా వేగంగా ఇతరులకు సంక్రమిస్తుందని భావించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడనమ్మకాన్ని కూడా నిషేధించినారు. ఐదవది: కుష్ఠురోగి నుండి, ఏవిధంగానైతే ఒక సింహము నుండి దూరంగా ఉంటామో ఆ విధంగా దూరంగా ఉండమని ఆదేశించినారు. ఇది ఎందుకంటే స్వయం కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకొనుటకు గానూ, తగినంత రక్షణ తీసుకొనుటకు గానూ, మరియు అల్లాహ్ ఆదేశించిన ఆచరణలు ఆచరించమని. కుష్ఠు వ్యాధి మనిషి అంగాలను క్రమంగా తినివేస్తుంది.

فوائد الحديث

అల్లాహ్ పై విశ్వాసముంచుట, భరోసా ఉంచుట మరియు షరియత్ ఆదేశించిన ఆచరణలను ఆచరించుట విధి.

అల్లాహ్ యొక్క ఆదేశాలపై, అల్లాహ్ యొక్క పూర్వనిర్ధిష్టము పై (విధివ్రాత పై) విశ్వాసముంచుట, ప్రతి విషయమూ అల్లాహ్ చేతిలో ఉన్నదని, కేవలం ఆయన మాత్రమే వాటిని ఉనికిలోనికి తీసుకు రాగలడని మరియు కేవలం ఆయన మాత్రమే వాటి ప్రభావాన్ని తొలగించగలడని మనస్ఫూర్తిగా విశ్వసించుట విధి.

అలాగే కొంతమంది ప్రజలు కొన్ని రంగులపట్ల మంచి శకునము, చెడు శకునము అని విశ్వసించే వారు ఉన్నారు; ఉదాహరణకు తెలుపు రంగు, నలుపు రంగు, ఎర్ర రంగు మొదలైనవి. అలాగే కొంతమంది అంకెలు, పేర్లలో అక్షరాల సంఖ్య, అలాగే అంగవైకల్యము కలిగిన వారు ఎదురు రావడం పట్ల శకునాలను విశ్వసించే వారు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎటువంటి విలువలేని మూఢవిశ్వాసాలు.

కుష్ఠురోగిని మరియు అటువంటి వ్యాధి ఉన్న వారిని, లేక మరింకే అంటువ్యాధులు ఉన్నవారి సమీపానికి వెళ్ళడాన్ని, వారితో కలయికను అల్లాహ్ నిషేధించినాడు. వారి సామీప్యము మరియు వారితో కలయిక ఆ వ్యాధుల ప్రభావానికి దారి తీసే కారణాలలో ఒకటి. అయితే కారణాలు వాటికవే స్వతంత్రమైనవి కావు, అవి స్వతంత్రంగా ఉండవు. అల్లాహ్ తనకు ఇష్టమైతే వాటి శక్తులను తీసివేస్తాడు, తద్వారా అవి ఎటువంటి ప్రభావం చూపవు, మరియు ఆయన కోరుకుంటే వాటిని ప్రభావితం చేస్తాడు.

التصنيفات

అజ్ఞాన కాలపు సమస్యలు, హృదయాల ఆచరణలు