“నా కంటే ముందు అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్త కూడా తన జాతివారిలో నుండి ఆయన మార్గాన్ని అనుసరించే మరియు ఆయన ఆదేశాన్ని…

“నా కంటే ముందు అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్త కూడా తన జాతివారిలో నుండి ఆయన మార్గాన్ని అనుసరించే మరియు ఆయన ఆదేశాన్ని పాటించే శిష్యులు మరియు సహచరులు లేకుండా పంపబడలేదు

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నా కంటే ముందు అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్త కూడా తన జాతివారిలో నుండి ఆయన మార్గాన్ని అనుసరించే మరియు ఆయన ఆదేశాన్ని పాటించే శిష్యులు మరియు సహచరులు లేకుండా పంపబడలేదు. వారు తమ తరువాత వచ్చిన వారితో తొలగించబడ్డారు. మరియు వారు (తరువాత వచ్చినవారు) చేయని పనులను గురించి మాట్లాడతారు మరియు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. ఎవరైతే వారితో తన చేతితో పోరాడుతాడో అతడు విశ్వాసి. ఎవరైతే వారితో తన నాలుకతో పోరాడుతాడో అతడు విశ్వాసి, మరియు ఎవరైతే వారితో తన హృదయంతో పోరాడుతాడొ అతడు విశ్వాసి. ఇక దీనికి మించి ఆవ గింజంత విశ్వాసం కూడా లేదు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: తన జాతివారి నుండి ఎంపిక చేయబడిన శిష్యులు, సహాయకులు, సహచరులు, నిజాయితీ గల ముజాహిదీన్లు కలిగి లేకుండా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఏ జాతికీ అల్లాహ్ ప్రవక్తను పంపలేదు. అటువంటి శిష్యులు వారి తరువాత వారి ప్రతినిధులుగా (ఖలీఫాలుగా) కాగలిగిన అన్ని అర్హతలూ కలిగి ఉండేవారు. వారు ఆ ప్రవక్త యొక్క సున్నత్’ను అనుసరిస్తారు మరియు ఆయన ఆదేశాలను శిరసావహిస్తారు. ఆ సలఫ్ సాలిహీన్’ల (ధార్మీకులైన పూర్వీకుల) తరువాత మంచివారు కాని వ్యక్తులు వచ్చారు. వారు తాము చేయని పనులను గురించి చెబుతారు మరియు వారు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. కాబట్టి వారితో తన చేతితో పోరాడేవాడు విశ్వాసి, తన నాలుకతో వారితో పోరాడేవాడు విశ్వాసి, మరియు తన హృదయంతో వారితో పోరాడేవాడు విశ్వాసి. అంతకు మించిన విశ్వాసం లేదు, కనీసం ఆవగింజంత కూడా లేదు.

فوائد الحديث

ఈ హదీథులో తమ మాటలతో మరియు పనులతో షరియత్’ను వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా పోరాడాలనే ప్రోత్సాహము ఉన్నది.

చెడును ఖండించడంలో హృదయ వైఫల్యం బలహీనమైన లేదా కోల్పోయిన విశ్వాసానికి నిదర్శనం.

పరమ పవిత్రుడూ, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రవక్తల కోసం వారి సందేశాన్ని ముందుకు తీసుకువెళ్లే సహచరుల సౌకర్యాన్ని కల్పించాడు.

ఎవరైతే విమోచనాన్ని కోరుకుంటున్నారో వారు ప్రవక్తల మార్గాన్ని అనుసరించాలి; ఎందుకంటే వారి మార్గం తప్ప మిగతా ప్రతి మార్గమూ విధ్వంసం మరియు మార్గభ్రష్టతానికి చేర్చేవే.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరుల యుగం నుండి దూరంగా వెళ్ళిన కొద్దీ, ఎక్కువ మంది ప్రజలు సున్నత్‌లను విడిచిపెట్టి, తమ ఇష్టాలను అనుసరించడం మరియు ‘బిద్’అత్’ లను ఆవిష్కరించడం (ధర్మం పేరిట, ధర్మములో లేని కొత్త విషయాలను అందులోనికి ప్రవేశ పెట్టడం) చూస్తాము.

ఈ హదీథులో జిహాద్ యొక్క స్థాయిలను వివరించడం జరిగింది. చేతితో జిహాద్ చేయుట అంటే - అది మార్పు తీసుకు రాగలిగిన వారి చేతిలో ఉంటుంది, ఉదాహరణకు అధికారంలో ఉన్నవారు, పాలకులు మరియు రాకుమారులు మొదలైన వారు; అలాగే నాలుక ద్వారా జిహాద్ చేయుట అంటే తమ వాక్కుల ద్వారా, తమ మాటల ద్వారా ప్రజలకు వివరించడం, సత్యం వైపునకు వారికి పిలుపునివ్వడం, తద్వారా మార్పు తీసుకు రావడం ఒక స్థాయి; అలాగే తమ హృదయం ద్వారా జిహాద్ చేయుట అంటే తమ హృదయంలో చెడును నిరసించడం, దానిని ఇష్టపడకపోవడం మరియు దాని పట్ల సంతోషించకుండా ఉండడం.

మంచి చేయమని ఆజ్ఞాపించడం, మరియు చెడును నిషేధించడం ప్రతి ఒక్కరిపై విధి.

التصنيفات

విశ్వాసం పెరుగుదల మరియు దాని తరుగుదల, ధర్మపోరాట రకాలు