“అల్లాహ్ మార్గములో (శ్రమించుటలో) ఎవరి పాదములు దుమ్ము, ధూళితో కప్పబడబడతాయో, వాటిని నరకాగ్ని తాకదు.”

“అల్లాహ్ మార్గములో (శ్రమించుటలో) ఎవరి పాదములు దుమ్ము, ధూళితో కప్పబడబడతాయో, వాటిని నరకాగ్ని తాకదు.”

అబూ అబ్స్ అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ జబ్ర్ (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ మార్గములో (శ్రమించుటలో) ఎవరి పాదములు దుమ్ము, ధూళితో కప్పబడబడతాయో, వాటిని నరకాగ్ని తాకదు.”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను వినిపిస్తున్నారు – అల్లాహ్ మార్గములో శ్రమిస్తున్న కారణంగా ఎవరి పాదములైతే దుమ్ము, ధూళితో ఆవరించబడతాయో, అటువంటి వ్యక్తిని నరకాగ్ని తాకదు అని.

فوائد الحديث

ఎవరైతే అల్లాహ్ మార్గములో శ్రమిస్తారో అటువంటి వారి కొరకు, "నరకము నుండి రక్షించబడతారు" అనే శుభవార్త ఇది.

ఆ రోజులలో ప్రజలు ఎక్కువగా కాలినడకనే ప్రయాణించేవారు, ఆ కారణంగా అల్లాహ్ మార్గములో వారి శరీరం అంతా దుమ్ము, ధూళి పేరుకు పోతూ ఉండేది, అలాగే వారి కాళ్ళు, పాదాలు కూడా దుమ్ము ధూళితో ఆవరించబడి పోయేవి.

ఇమాం హాఫిజ్ ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “కేవలం పాదాలకు దుమ్ము, ధూళి తగలడం నరకాగ్నిని అతనిపై నిషేధిస్తుంది అంటే, మరి అల్లాహ్ మార్గములో తన శక్తి, సామర్థ్యాలు పూర్తిగా ఆవిరి అయిపోయేలా శ్రమించే వానికి ఏమి లభిస్తుందో ఆలోచించండి.”

التصنيفات

ధర్మపోరాట ఘనత