. .

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరైన ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలలో చివరి పది రోజులు ఇతికాఫ్ (మస్జిద్‌లో ఏకాంతంగా గడపడం) చేసేవారు. ఆయన మరణం వరకు ఈ సున్నతును తప్పకుండా పాటించారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్యలు కూడా ఇదే విధంగా ఇతికాఫ్ కొనసాగించినారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ముస్లిం సమాజానికి మాతృమూర్తి అయిన ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా పలికినారు: 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, రమదాన్ చివరి పది రోజుల్లో ఇతికాఫ్ (మసీదులో ఏకాంతంగా ప్రత్యేక ధ్యాన నివాసం) పాటించేవారు. ఇది లైలతుల్ ఖద్ర్ (విధివ్రాత నిర్ణయం జరిగే అత్యంత గొప్ప రాత్రి) కోసం అన్వేషణగా ఉండేది. ఆయన ఈ సున్నతును మరణం వరకు కొనసాగించారు. ఆయన తర్వాత ఆయన భార్యలు (రదియల్లాహు అన్హున్నా) కూడా ఇతికాఫ్ ను కొనసాగించినారు'.

فوائد الحديث

మహిళలు కూడా షరియా నియమాలకు అనుగుణంగా, ఫిత్నా (అనర్థాలు) నుండి సురక్షితంగా ఉండగలిగే పరిస్థితులలో మస్జిదులలో ఇతికాఫ్ పాటించడం షరియాత్ ప్రకారం ధర్మబద్ధమైనదే.

రమదాన్ చివరి పది రోజుల్లో ఇతికాఫ్ పాటించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థిరంగా పాటించిన సున్నతు. ఆయన ఈ పది రోజులు మస్జదులో నిరంతరం ఇతికాఫ్ చేసేవారు, ఇది ఒక సున్నతు మువక్కదా (అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రవక్త యొక్క సున్నతు.

ఇతికాఫ్ ఒక నిరంతర సున్నతుగా కొనసాగుతున్నది, ఇది రద్దు చేయబడలేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత కూడా ఆయన భార్యలు ఇతికాఫ్‌ను కొనసాగించారు.

التصنيفات

ఏతికాఫ్