ఒక ముస్లిం వ్యక్తి యొక్క రక్తం (ప్రాణం తీయడం) ఈ మూడు కారణాలలో ఒకదాని వలన మాత్రమే ధర్మసమ్మతం అవుతుంది

ఒక ముస్లిం వ్యక్తి యొక్క రక్తం (ప్రాణం తీయడం) ఈ మూడు కారణాలలో ఒకదాని వలన మాత్రమే ధర్మసమ్మతం అవుతుంది

ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక ముస్లిం వ్యక్తి యొక్క రక్తం (ప్రాణం తీయడం) ఈ మూడు కారణాలలో ఒకదాని వలన మాత్రమే ధర్మసమ్మతం అవుతుంది: వివాహితుడు అయిన వ్యభిచారి, ప్రాణానికి ప్రతిగా ప్రాణం, మరియు తన ధర్మాన్ని (ఇస్లాం ను) విడిచి సమాజాన్ని (ముస్లింల సమాజము) వదిలిపోయిన వ్యక్తి.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

'నిశ్చయంగా ఒక ముస్లిం యొక్క రక్తం (ప్రాణం) నిషేధించ బడింది (హరామ్), కేవలం మూడు కారణాలలో ఒకదానిని ఆ వ్యక్తి ఆచరిస్తే తప్ప' అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినారు. మొదటిది: ఎవరైతే ధర్మబద్ధమైన నిఖా ఒప్పందం ద్వారా వివాహం చేసుకున్న తర్వాత, వ్యభిచారం (ఫాహిషా) అనే నేరం చేస్తాడో; అతడిని రాళ్లతో కొట్టడం (రజ్మ్) ద్వారా చంపడానికి అనుమతి ఉంది. రెండవది: ఎవరైతే ఉద్దేశపూర్వకంగా, అన్యాయంగా ఒక పవిత్రమైన ప్రాణాన్ని తీస్తాడో (నిర్దోషిని చంపుతాడో), అతనిపై దాని (అతడి ప్రాణం తీయడం) యొక్క షరతులు వర్తిస్తాయి." మూడవది: ముస్లింల సమాజం (జమాఅత్) నుండి బయటికి పోయిన వాడు; అది ఇస్లాం ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టడం ధర్మభ్రష్టత (ఇర్తిదాద్) ద్వారా కావచ్చు, లేదా ధర్మభ్రష్టత కాకుండా దానిలో కొంత భాగాన్ని వదిలివేయటం ద్వారా కావచ్చు, ఉదాహరణకు తిరుగుబాటుదారులు, దారి దోపిడీదొంగలు, మరియు ఖవారిజ్ వంటి వారు.

فوائد الحديث

ఈ మూడు పనులు చేయడం నిషేధించబడింది మరియు వాటిలో ఏ ఒక్క దాన్ని చేసినా, ఆ వ్యక్తి మరణ శిక్షకు అర్హుడవుతాడు: అవి - ఇస్లాం ధర్మాన్ని త్యజించిన "ముర్తద్", మరియు "హద్" (నిర్దిష్ట శిక్ష) కిందకు వచ్చే ఇద్దరు - వివాహిత వ్యభిచారి మరియు ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేసిన హంతకుడు.

గౌరవాన్ని కాపాడటం మరియు దాని పవిత్రతను సంరక్షించడం తప్పనిసరి.

ముస్లింను గౌరవించడం తప్పనిసరి, మరియు అతని రక్తం (ప్రాణం) పవిత్రమైనది.

ముస్లింల సమూహంతో కలిసికట్టుగా ఉండాలని, వాళ్ల నుంచి విడిపోకూడదని ప్రోత్సహించడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనా విధానం అత్యుత్తమమైనది, ఎందుకంటే ఆయన ప్రవచనాలు కొన్నిసార్లు వర్గీకరణ ద్వారా ఇవ్వబడతాయి; ఎందుకంటే వర్గీకరణ విషయాలను పరిమితం చేసి, వాటిని క్రోడీకరిస్తుంది, మరియు ఇది త్వరగా గుర్తుంచుకోవడానికి (కంఠస్థం చేయడానికి) సహాయపడుతుంది.

అల్లాహ్ నిర్ణయించిన హద్దులు (శిక్షలు) నేరస్థులను అరికట్టడానికి, సమాజాన్ని రక్షించడానికి మరియు నేరాల నుండి కాపాడడానికి ఏర్పాటు చేయబడినవి.

ఈ హద్దులను అమలు చేయడం పాలకాధికారిలోని బాధ్యత.

హత్యకు గల కారణాలు మూడు కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ, అవి ఈ మూడు పరిధి దాటి వెళ్లవు. ఇబ్నుల్-అరబి ల్మాలికీ ఇలా అన్నారు: “ఏ పరిస్థితులలోనైనా (హత్య కారణాలు) ఈ మూడు నుంచి బయటపడవు. ఎందుకంటే ఎవడు మంత్రం చేసినా లేదా అల్లాహ్‌ దైవదూతను దూషించినా, అతను కుఫ్రులో పడతాడు; కాబట్టి అతను తన మతాన్ని విడిచినవారి కోవలోకే చేరుతాడు.”

التصنيفات

హుదూద్ ల నిబంధనలు