“అతడిని చంపరాదు; ఒకవేళ అతడిని చంపినట్లయితే (గమనించు) అతడిని చంపక ముందు నీవు ఏ స్థానంలో ఉన్నావో, (షహాదా పలికిన…

“అతడిని చంపరాదు; ఒకవేళ అతడిని చంపినట్లయితే (గమనించు) అతడిని చంపక ముందు నీవు ఏ స్థానంలో ఉన్నావో, (షహాదా పలికిన తరువాత) అతడు ఆ స్థానంలో ఉన్నాడు. మరియు షహదా పలుకక ముందు అతడు ఏ స్థానంలో ఉన్నాడో నీవు ఆ స్థానంలో ఉంటావు.”

అల్ మిఖ్’దాద్ ఇబ్న్ ఆమిర్ అల్ కిందియ్య (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికినాడు: “ఒకవేళ ఎవరైనా ఒక అవిశ్వాసి (యుద్ధంలో తారసపడి) మేమిద్దరమూ తలపడినపుడు; అతడు తన కరవాలముతో నా చేతిపై దాడి చేసి, నా చేతిని ఖండించి వేసి, నా నుంచి పరుగెత్తుకుని వెళ్ళి ఒక చెట్టును రక్షణగా చేసుకుని “అల్లాహ్’కు నన్ను నేను సమర్పించుకున్నాను” అని షహాదా పఠించినట్లైతే, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు ఆ విధంగా (షహాదా) పలికిన తరువాత నేను అతడిని చంపవచ్చునా?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, అతడిని చంపరాదు” అన్నారు. దానికి మిఖ్’దాద్ ఇబ్న్ ఆమిర్ “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు నా ఒక చేతిని ఖండించినాడు. దాని తరువాత కూడా అతడిని వధించకూడదా?” అన్నాడు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడిని చంపరాదు; ఒకవేళ అతడిని చంపినట్లయితే (గమనించు) అతడిని చంపక ముందు నీవు ఏ స్థానంలో ఉన్నావో, (షహాదా పలికిన తరువాత) అతడు ఆ స్థానంలో ఉన్నాడు. మరియు షహదా పలుకక ముందు అతడు ఏ స్థానంలో ఉన్నాడో నీవు ఆ స్థానంలో ఉంటావు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

అల్ మిఖ్’దాద్ ఇబ్న్ అల్ అస్వద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించినారు: యుద్ధంలో ఒకవేళ తనకు ఒక అవిశ్వాసి తారసపడి, తామరిద్దరూ ఖడ్గాలతో తలపడినపుడు, అతడు ఖడ్గంతో తన రెండు చేతులలో ఒకదానిపై దాడి చేసి దానిని ఖండించి వేసి, తరువాత తన నుండి పారిపోయి ఒక చెట్టును రక్షణగా చేసుకుని “అష్’హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్” అని షహాదా పలికినట్లయితే, నా చేతిని ఖండించిన వాడిని చంపడానికి అనుమతి ఉందా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “లేదు, అతడిని చంపరాదు.” అపుడు అతడు ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు నా ఒక చేతిని ఖండించినాడు, అయినా అతడిని చంపరాదా?” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అవును, అతడిని చంపరాదు. ఎందుకంటే (అతడు ఇస్లాం స్వీకరించుట వలన) అతని రక్తం చిందించుట హరాం (నిషేధము). అతడు ఇస్లాం స్వీకరణ ప్రకటించిన తర్వాత నీవు అతనిని చంపినట్లయితే, అతడు ఇస్లాం ప్రకటించడం అతడి జీవితాన్ని నీ జీవితం లాగానే ఉల్లంఘించరానిదిగా చేసింది, అతడు నీతో సమాన స్థానం కలిగి ఉంటాడు. అతణ్ణి చంపినందుకు చట్ట ప్రకారం ప్రతీకారంగా నీకు మరణశిక్ష విధించబడుతుంది.”

فوائد الحديث

ఎవరైనా సరే, అతడి మాటలు, లేక అతని చర్యలు, అతడు ఇస్లాం స్వీకరించినట్లు సూచిస్తున్నట్లైతే అతడిని చంపుట హరాం (నిషేధము).

ముస్లిములతో యుద్ధము కొనసాగుతూ ఉండగా ఒక అవిశ్వాసి ఒకవేళ ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారినట్లయితే అతడి రక్తము పరిరక్షించడినట్లే; ఇస్లాం స్వీకరించిన పిదప అతడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు అని స్పష్టంగా నిర్ధారణ కానంత వరకు అతడిని చంపకుండా ఉండుట ముస్లిముల విధి.

ఒక ముస్లిం తన కోరికలను షరియా ప్రకారమే అనుసరించాలి గానీ మతమౌఢ్యము మరియు ప్రతీకారంతో కాదు.

ఇబ్నె హజర్ ఇలా పలికినారు: ప్రశ్నలు అడుగుట సరైనదే అని తెలుస్తున్నది. అయితే పూర్వపు ధర్మపరాయణులైన పెద్దల నుండి మనకు అందిన ఙ్ఞానము ప్రకారం ఈ విధంగా ఇంకా జరుగని వాటిని గురించి ప్రశ్నించడం అయిష్టమైనదిగా భావించబడినది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ధర్మపరాయణులైన పూర్వీకుల నుండి – అసలే మాత్రమూ జరిగే అవకాశం లేని ఊహా జనితమైన సంఘటనలను గురించి ప్రశ్నించడం అయిష్టంగా భావించబడింది; కానీ జరగడానికి పూర్తిగా అవకాశం ఉన్న సంఘటనలను గురించి వాటి పరిణామాలను గురించి తెలుసుకొనుటకు ప్రశ్నించడం సరియైనదే – అని తెలుస్తున్నది.

التصنيفات

ఇస్లాం