“(వారు చెప్పినది) వినండి మరియు అనుసరించండి. ఎందుకంటే, వారికి అప్పగించబడిన బాధ్యత వారిపై ఉంది. మీకు అప్పగించబడిన…

“(వారు చెప్పినది) వినండి మరియు అనుసరించండి. ఎందుకంటే, వారికి అప్పగించబడిన బాధ్యత వారిపై ఉంది. మీకు అప్పగించబడిన బాధ్యత మీపై ఉంది.”

వాఇల్ అల్ హద్రమీ ఉల్లేఖన: “సలమహ్ ఇబ్న్ యజీద్ అల్ జు’ఫీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగినారు: “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! పాలకులు మాపై నిలబడి (అంటే బలవంతంగా) తమ హక్కులను మా నుండి కోరుతూ (తీసుకుంటూ); మాకు చెందిన హక్కులను నిరాకరించడాన్ని మీరు చూసినారా? అటువంటి స్థితిలో, మమ్ములను ఏమి చేయమని మీరు ఆదేశిస్తారు? అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడి నుండి తన ముఖాన్ని మరో వైపునకు త్రిప్పుకున్నారు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మళ్ళీ ప్రశ్నించాడు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని అతడి నుండి మరో వైపునకు త్రిప్పుకున్నారు. అతడు రెండోసారో లేక మూడోసారో మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించాడు. అపుడు అల్-అష్’అత్ ఇబ్న్ ఖైస్ (రదియల్లాహు అన్హు) అతడిని ప్రక్కకు లాగినాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “(వారు చెప్పినది) వినండి మరియు అనుసరించండి. ఎందుకంటే, వారికి అప్పగించబడిన బాధ్యత వారిపై ఉంది. మీకు అప్పగించబడిన బాధ్యత మీపై ఉంది.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రజలు తమ మాట వినాలని, తు.చ. తప్పకుండా పాటించాలను, అది తమ హక్కు అని, తమ హక్కును ప్రజల నుండి బలవంతంగా లాక్కుంటూ, వారికి న్యాయం చేయడాన్ని, యుద్ధంలో గెలిచిన సంపదను పంచడాన్ని, వారి సమస్యలను పరిష్కరించడాన్ని, వారి కష్టాలను తొలగించడాన్ని నిరాకరించే పాలకుని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడం జరిగింది “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం!, అటువంటి సందర్భములో మమ్ములను ఏమి చేయమంటారు, మీ ఆదేశము ఏమిటి?” అని. అది తనకు ఇష్టం లేని విషయం, తాను అసహ్యించుకునే విషయం అన్నట్లుగా, ఆ ప్రశ్నించిన వ్యక్తి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని మరో వైపునకు త్రిప్పుకున్నారు. కానీ ఆ ప్రశ్నించిన వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అదే ప్రశ్న రెండోసారి, మూడోసారి కూడా అడిగాడు. అపుడు అల్-’అష్’అత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) అతడిని మౌనంగా ఉండమని పక్కకు లాగినారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని ప్రశ్నకు స్పందిస్తూ ఇలా సమాధానమిచ్చారు: “వారు చెబుతున్న దానిని వినండి, మరియు వారి ఆదేశాలను పాటించండి;

فوائد الحديث

ఇందులో ప్రజల హక్కులను పాలకులుగా వారు నెరవేర్చనప్పటికీ, సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు ఇష్టమైన విషయాలలో పాలకుల మాట వినాలి మరియు పాటించాలి అనే ఆదేశం ఉన్నది.

ప్రజల పట్ల కర్తవ్యపాలనలో పాలకుల వైఫల్యం, ప్రజలు పాలకుల పట్ల తమ కర్తవ్యాలను నిర్వహించకుండా ఉండడాన్ని సమర్థించదు. ప్రతి ఒక్కరూ తనపై విధించబడిన కర్తవ్యాలకు, విధులకు బాధ్యత వహిస్తారు, మరియు ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యపాలనలో వైఫల్యానికి జవాబుదారీగా ఉంటారు.

ధర్మం అనేది బేరసారాల విధానం కాదు, నీవు నాకు ఇది చేస్తే, నేను నీకు అది చేస్తాను మాదిరిగా. అది తనపై విధిగావించబడిన కర్తవ్యాలను తప్పనిసరిగా నెరవేర్చాలి అనే నిబద్ధత - ప్రతిగా అవతలి వ్యక్తి తనపై విధిగావించబడిన కర్తవ్యాలను నెరవేర్చకపోయినప్పటికీ, లేక నెరవేర్చుటలో విఫలమైనప్పటికీ.

التصنيفات

సమాజంపై ఇమామ్ యొక్క హక్కు