“యూదునికి గానీ లేక క్రైస్తవునికి గానీ మీరు ముందుగా “సలాం” చెప్పకండి. మరియు ఒకవేళ మీకు వారిలో ఎవరినైనా దారిలో…

“యూదునికి గానీ లేక క్రైస్తవునికి గానీ మీరు ముందుగా “సలాం” చెప్పకండి. మరియు ఒకవేళ మీకు వారిలో ఎవరినైనా దారిలో ఎదురైతే వారిని దారి అంచుకు పోయేలా చేయండి.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “యూదునికి గానీ లేక క్రైస్తవునికి గానీ మీరు ముందుగా “సలాం” చెప్పకండి. మరియు ఒకవేళ మీకు వారిలో ఎవరినైనా దారిలో ఎదురైతే వారిని దారి అంచుకు పోయేలా చేయండి.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా వివరించారు: "ఒక యూదునికి గానీ, లేక ఒక క్రైస్తవునికి గానీ, వారు ‘జిమ్మీ’ లు గా ఉన్నప్పటికీ, ఒక ముస్లిం ముందుగా సలాం చెప్పరాదు, మిగతా అవిశ్వాసుల సంగతి ఇక చెప్పనే అక్కరలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా వివరించారు: ఒకవేళ మనలో ఎవరైనా వారిలో ఒకరిని (యూదులు, లేక క్రైస్తవులలో ఒకరిని) రహదారిలో కలవడం జరిగితే, అతన్ని రహదారి యొక్క ఇరుకైన ప్రాంతానికి (దారి అంచులకు) వెళ్ళి పోయేలా చేయాలి. విశ్వాసి ఎప్పుడూ దారి మధ్యలో నడుస్తాడు. అవిశ్వాసి ఎప్పుడూ అతనికి దారి ఇస్తాడు. ఒక ముస్లిం ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించబడడు.

فوائد الحديث

ఒక యూదునికి గానీ, లేక క్రైస్తవునికి గానీ లేక ఇతర అవిశ్వాసులకు గానీ ఒక ముస్లిం ముందుగా సలాం చెప్పుట అనుమతించబడలేదు.

ఒకవేళ వారే ముందుగా సలాం చెప్పినట్లయితే ఒక ముస్లిం అతనికి “వ అలైకుం” అని సమాధానం ఇచ్చుటకు అనుమతి ఉన్నది.

రోడ్డు విశాలంగా ఉన్నప్పటికీ, ఒక అవిశ్వాసిని ఉద్దేశపూర్వకంగా మరియు అనవసరంగా అతడిని బాధపెట్టడం ద్వారా అతనిని రోడ్డు యొక్క ఇరుకైన భాగానికి వెళ్ళేలా చేయడానికి బలవంతం చేయడానికి ముస్లింకు అనుమతి లేదు. అయితే ఒకవేళ రోడ్డు ఇరుకుగా లేదా రద్దీగా ఉంటే, అప్పుడు ముందుగా రహదారిపై నడవడానికి ముస్లిం ఎక్కువ అర్హులు మరియు అవిశ్వాసులు దారి ఇవ్వాలి, లేదా దారికి దూరంగా ఉండాలి.

ఇతరులను అవమానాలకు అణచివేతకు గురి చేయకుండా, లేక దుర్భాషలను ఉపయోగించకుండా ముస్లిముల గౌరవాన్ని ప్రదర్శించడం చేయాలి.

అవిశ్వాసుల కొరకు కఠిన పరిస్థితులను కల్పించడం కేవలం వారు అల్లాహ్ ను విశ్వసించకుండా ఇతర మిథ్యా దైవాలను విశ్వసించడమే. అవిశ్వాసులు విశ్వాసం స్వీకరించుటకు, తద్వారా నరకాగ్ని నుండి వారి విముక్తి కొరకు, ఇది కూడా ఒక కారణం కావచ్చు.

“ఎలా ఉన్నావ్, అంతా బాగేనా?”; “ఈనాటి ఉదయం ఎలా మొదలయ్యింది?”; లేక “సాయంత్రం ఎలా గడిచింది?” మొదలైన పదాలతో ఒక ముస్లిం, ఒక అవిశ్వాసిని ముందుగా పలుకరించుటలో తప్పేమీ లేదు. నిషేధము అవిశ్వాసికి ఒక ముస్లిం ముందుగా “సలాం” చెప్పుటపై ఉన్నది; పలుకరించుట పై కాదు.

ఎంపిక చేసిన అభిప్రాయం ఆధారంగా, ధర్మములో విశ్వాసం లేని, లేక ధర్మములో లేని నూతన విషయాలను ధర్మము పేరిట కొత్తగా ప్రారంభించే వానికి (బిద్’అతీకి) ముందుగా శాంతి శుభాకాంక్షలతో (సలాంతో) ప్రారంభించకూడదు. ఒకవేళ ఒక ముస్లిం వ్యక్తి తనకు తెలియని వ్యక్తిని సలాంతో పలకరిస్తే, అతడు ఒక యూదుడు, లేక ఒక క్రైస్తవుడు, లేదా ఒక మతభ్రష్టుడు, లేక ఒక ఒక బిద్’అతీ (ధర్మములో కొత్త విషయాలను ప్రారంభించే వాడు) అని తేలితే, అతడు ఇలా అనాలి “నా సలాంను నేను వెనుకకు తీసుకుంటున్నాను”.

التصنيفات

సలాంచేసే మరియు అనుమతి కోరే పద్దతులు