“మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే,…

“మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”.

[ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – విశ్వాసములో సంపూర్ణత కలిగిన విశ్వాసి ఎవరంటే, ఉత్తమ వ్యక్తిత్వము, శీల సంపద కలిగిన వాడు, చిరునవ్వుతో ప్రకాశవంతమైన ముఖము కలిగినవాడు, సత్కార్యములు చేయువాడు, అందరితో మంచిగా సంభాషణ చేయువాడు, కీడు మరియు చెడులనుండి దూరంగా ఉండేవాడు – అని తెలియ జేస్తున్నారు. అలాగే విశ్వాసులలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన స్త్రీలతో ఉత్తమంగా ఉంటాడో అన్నారు, అంటే ఉదాహరణకు తన భార్యలతో, కూతుళ్ళతో, తన అక్కలు, చెల్లెళ్ళతో మరియు తన బంధువులలోని స్త్రీలతో. ఎందుకంటే వీరంతా – ఉత్తమంగా వ్యవహరించడానికి మిగతా వారి కంటే ముందు అర్హులు.

فوائد الحديث

ఇందులో నైతిక విలువలు మరియు ఉత్తమ నడవడికల యొక్క ఘనత గురించి తెలుస్తున్నది. అవి విశ్వాసములో భాగమని తెలుస్తున్నది.

ఆచరణ విశ్వాసపు పునాదులపై ఉంటుంది. మరియు విశ్వాసములో పెరుగుదల మరియు తరుగుదల కూడా ఉంటాయి.

ఇస్లాం స్త్రీలను గౌరవిస్తుంది. మరియు వారిపట్ల ఉత్తమంగా వ్యవహరించమని ప్రోత్సహిస్తుంది.

التصنيفات

సద్గుణాలు, భార్యభర్తల మధ్య పది విషయాలు