“అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలు ఉన్న అన్ని మాంసాహార జంతువులను మరియు పంజాలు, గోళ్ళు…

“అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలు ఉన్న అన్ని మాంసాహార జంతువులను మరియు పంజాలు, గోళ్ళు కలిగిన అన్ని పక్షులను తినడాన్ని నిషేధించారు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలు ఉన్న అన్ని మాంసాహార జంతువులను మరియు పంజాలు, గోళ్ళు కలిగిన అన్ని పక్షులను తినడాన్ని నిషేధించారు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలతో వేటాడి పీక్కుతినే ఏ జంతువునైనా తినడాన్ని నిషేధించారు మరియు గోళ్ళతో కోసి, కాళ్ళతో పట్టుకుని పీక్కుతినే పక్షిని తినడాన్ని కూడా నిషేధించినారు.

فوائد الحديث

ఇస్లాం ఆహారం, పానీయం, మొదలైన ఇతర విషయాలలో మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది.

ఏదైనా ఆహార పదార్థము నిషేధించబడినది అని ఋజువు ద్వారా నిరూపించబడి ఉంటే తప్ప, ఆహారానికి సంబంధించిన ప్రాథమిక సూత్రం ఏమిటంటే తినుటకు అనుమతి ఉంది.

التصنيفات

జమతువుల్లోంచి మరియు పక్షుల్లోంచి హలాలైనవి మరియు హరామైనవి