జమతువుల్లోంచి మరియు పక్షుల్లోంచి హలాలైనవి మరియు హరామైనవి

జమతువుల్లోంచి మరియు పక్షుల్లోంచి హలాలైనవి మరియు హరామైనవి

1- “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”*. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈ విధంగా నివేదించబడినది “ఓ రసూలల్లాహ్ (స)! మరి చనిపోయిన జంతువులనుండి తీసే కొవ్వు గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది ఓడలకు, మరియు చర్మాలకు (అవి పాడుకాకుండా) పూయబడుతుంది; మరియు ప్రజలు దానిని దీపాలలో (చమురుగా) వాడుతారు”. దానికి ఆయన (స) “లేదు, అది హరాం” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భముగా ఇలా అన్నారు: “యూదులను అల్లాహ్ నాశనం చేయుగాక! నిశ్చయంగా అల్లాహ్ (చనిపోయిన జంతువుల) కొవ్వును వారికి నిషేధించినాడు. కానీ వారు దాని కరిగించారు, దానిని అమ్మినారు మరియు దానినుండి వచ్చిన సొమ్మును తిన్నారు.”