“నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని…

“నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”

మక్కా విజయం (ఫతహ్ మక్కా) జరిగిన సంవత్సరం, ఆ సందర్భముగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నపుడు ఆయన ఇలా అనగా తాను విన్నాను అని జాబిర్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈ విధంగా నివేదించబడినది “ఓ రసూలల్లాహ్ (స)! మరి చనిపోయిన జంతువులనుండి తీసే కొవ్వు గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది ఓడలకు, మరియు చర్మాలకు (అవి పాడుకాకుండా) పూయబడుతుంది; మరియు ప్రజలు దానిని దీపాలలో (చమురుగా) వాడుతారు”. దానికి ఆయన (స) “లేదు, అది హరాం” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భముగా ఇలా అన్నారు: “యూదులను అల్లాహ్ నాశనం చేయుగాక! నిశ్చయంగా అల్లాహ్ (చనిపోయిన జంతువుల) కొవ్వును వారికి నిషేధించినాడు. కానీ వారు దాని కరిగించారు, దానిని అమ్మినారు మరియు దానినుండి వచ్చిన సొమ్మును తిన్నారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) మక్కా విజయం సంవత్సరములో, ఆ సందర్భముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నపుడు, ఆయన ఇలా అనడం విన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మద్యము, మృత జంతువులు, పందులు, మరియు విగ్రహాల అమ్మకాలను నిషేధించినారు.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి చనిపోయిన జంతువుల కొవ్వును అమ్మడానికి అనుమతి ఉందా? ఎందుకంటే దానిని ఓడలకు పూత పూయడానికి, చర్మాలకు (అవి చెడిపోకుండా) గ్రీజులాగా రాయడానికి, మరియు ప్రజలు తమ దీపాలను వెలిగించడానికి ఉపయోగిస్తారు” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు అది నిషేధము” అన్నారు. ఆ సందర్భముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ యూదులను నాశనం చేసి వారిని శపించాడు. అల్లాహ్ వారిపై పశువుల కొవ్వులను నిషేధించినప్పుడు, వారు దానిని కరిగించి, దానిని అమ్మి, దాని ధరను తిన్నారు.

فوائد الحديث

ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: మృతపశువులు, మద్యము, మరియు పందులు: వీటిలో ప్రతి ఒక్కటీ అమ్ముట నిషేధము అనే విషయం పై ముస్లిములందరూ ఏకగ్రీవంగా అంగీకరించినారు.

అల్ ఖాదీ ఇలా అన్నారు: ఈ హదీథులో తినుటకు లేదా ప్రయోజనం పొందుటకు అనుమతించబడని వాటిని అమ్ముట కూడా నిషేధము అని తెలుపబడింది. మరియు వాటి ధరను కూడా తినుట కూడా అనుమతించ బడలేదు; చనిపోయిన పశువుల కొవ్వు విషయంలో ఈ విషయం స్పష్టం చేయబడింది.

హాఫిజ్ ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు - “హువ హరామున్” (ఇది నిషేధము) యొక్క అర్థము ‘దానిని అమ్మడం నిషేధం, కానీ దాని నుండి ప్రయోజనం పొందడం కాదు’ అని చాలా మంది ధర్మపండితులు అర్థం చేసుకున్నారని ఈ సంఘటన యొక్క సందర్చం బలంగా సూచిస్తున్నది.

నిషేధించబడిన దానిని దేనినైనా అనుమతించడానికి దారి తీసే ఏ ఉపాయమూ చెల్లదు.

ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ధర్మపండితులు (ఉలమా) ఇలా అన్నారు: చనిపోయిన వాటిని అమ్ముట నిషేధము అనుటలో, ఒకవేళ (యుద్ధంలో) మనం ఒక అవిశ్వాసిని చంపినట్లైతే, అతడి దేహాన్ని కొనడానికి, లేదా అతడి దేహాన్ని తమకు అప్పజెప్పడానికి అవిశ్వాసులు సొమ్మును ఇవ్వజూపితే, ఆ సొమ్ము తీసుకుని అతడి దేహాన్ని ఇవ్వడం హరాం (నిషేధము). ఒక హదీథులో ఈ విధంగా వచ్చింది: ఖందక్ యుద్ధము జరిగిన దినమున ముస్లిములు నౌఫాల్ బిన్ అబ్దుల్లాహ్ అల్ మఖ్’జూమీ అనే అవిశ్వాసిని చంపినారు. అపుడు అతడి దేహాన్ని అప్పజెప్పడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పదివేల దిర్హములను ఇవ్వ జూపినారు. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ ధనాన్ని తీసుకోలేదు. మరియు అతడి దేహాన్ని ఇచ్చివేసారు.

التصنيفات

జమతువుల్లోంచి మరియు పక్షుల్లోంచి హలాలైనవి మరియు హరామైనవి