“ప్రతి సలాహ్’ కొరకు (నమాజు కొరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసేవారు

“ప్రతి సలాహ్’ కొరకు (నమాజు కొరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసేవారు

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా పలికినారని అమ్ర్ ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు: “ప్రతి సలాహ్’ కొరకు (నమాజు కొరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసేవారు.” నేను అడిగాను “మరి నీవు ఎలా చేస్తూ ఉండేవాడివి?” అని. దానికి ఆయన “మాలో ప్రతి ఒక్కరికీ, భగ్నం కానంత వరకూ, ఒకసారి చేసిన ఉదూనే సరిపోయేది” అన్నారు.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

వుజూ భగ్నం కాక పోయినా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్’కు తాజాగా ఉదూ చేసుకునేవారు. ఇలా ఎందుకంటే ఉదూ యొక్క ఘనతను మరియు ప్రతిఫలాన్ని పొందుటకు గాను. అయితే, ఒక వుజూతో, అది భగ్నం కానంతవరకు, విధిగా ఆచరించవలసిన నమాజులలో ఒకటి కంటే ఎక్కువ నమాజులను ఆచరించుటకు అనుమతి ఉన్నది.

فوائد الحديث

ప్రతి సలాహ్’కు తాజాగా వుజూ చేయడమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణగా ఉండేది – ఆ విషయములో కూడా సంపూర్ణత సాధించాలనేది వారి కోరిక.

ప్రతి సలాహ్ కొరకు తాజాగా వుజూ చేయడం అభిలషణీయము.

అయితే ఒకసారి చేసిన వుజూతో (అది భగ్నం కానంత వరకు) ఒకటి కంటే ఎక్కువ సలాహ్ లు ఆచరించుటకు అనుమతి ఉన్నది.

التصنيفات

వజూ ప్రాముఖ్యత