إعدادات العرض
నిశ్చయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు మరియు నిద్రపోవడం ఆయనకు తగదు
నిశ్చయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు మరియు నిద్రపోవడం ఆయనకు తగదు
అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య నిలబడి ఐదు మాటలు సెలవిచ్చారు: «నిశ్చయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు మరియు నిద్రపోవడం ఆయనకు తగదు, ఆయన త్రాసులను వంచుతాడు మరియు త్రాసులను పైకి ఎత్తుతాడు, పగటి ఆచరణకు ముందు రాత్రి ఆచరణ, మరియు రాత్రి ఆచరణకు ముందు పగటి ఆచరణ ఆయన ముందు సమర్పించబడుతుంది, తేజస్సు ఆయన అడ్డు తెర - మరో ఉల్లేఖనం ప్రకారం: అగ్ని- ఆయన దానిని తెరిస్తే ఆయన ముఖ కాంతి ఆయన దృష్టికి అందేంతవరకు ఆయన సృష్టిని కాల్చేస్తుంది».
الترجمة
العربية Português دری Македонски Tiếng Việt Magyar ქართული Indonesia বাংলা Kurdî ไทย অসমীয়া Nederlands Hausa ਪੰਜਾਬੀ Kiswahili Tagalog ភាសាខ្មែរ English ગુજરાતી සිංහල Русский मराठी മലയാളം ಕನ್ನಡ Српски Türkçe हिन्दी اردوالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఐదు సంపూర్ణ వచనాలను బోధించారు, అవి: మొదటిది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు. రెండవది: ఆయనకు నిద్ర అసంభవం; ఆయన సర్వ పోషకత్వం మరియు జీవం యొక్క పరిపూర్ణత వలన. మూడవది: ఆయన, తన వైపుకు ఎత్తబడే దాసుల ఆచరణలను మరియు భూమిపైకి పంపే వారి ఆహారములను తూకం వేయడం ద్వారా తూకమును తగ్గిస్తాడు మరియు పెంచుతాడు. కాబట్టి, ప్రతి ప్రాణి యొక్క వాటా మరియు భాగమైన ఆహారమును తాను తలిచినట్లుగా ఆయన తగ్గించి కుదిస్తాడు, మరియు పెంచి విశాలపరుస్తాడు. నాలుగవది: దాసులు రాత్రి చేసిన ఆచరణలు మరుసటి పగలు రాకముందే, మరియు పగలు చేసిన ఆచరణలు మరుసటి రాత్రి రాకముందే ఆయనకు సమర్పించబడతాయి; కావున, సంరక్షక దైవదూతలు రాత్రి కాలపు ఆచరణలను, రాత్రి ముగిసిన తర్వాత పగటి ఆరంభంలోనూ, మరియు పగటి కాలపు ఆచరణలను, పగలు ముగిసిన తర్వాత రాత్రి ఆరంభంలోనూ తీసుకుని పైకి వెళ్తారు. ఐదవది: ఆయనను చూడకుండా నిరోధించే ఆయన తెర కాంతి లేదా అగ్ని, ఒకవేళ ఆయన దానిని తొలగిస్తే, ఆయన సృష్టిలో ఆయన దృష్టి చేరినంత వరకు ఆయన ముఖ తేజస్సు కాల్చివేస్తుంది; ఆయన ముఖ తేజస్సు అంటే ఆయన కాంతి, ఆయన వైభవం మరియు ఆయన ప్రకాశం. దీని అర్థం ఏమిటంటే: ఒకవేళ ఆయన తనను చూడకుండా అడ్డుకుంటున్న తెరను తొలగించి, తన సృష్టి ముందు ప్రత్యక్షమైతే, ఆయన ముఖ తేజస్సు, ఆయన దృష్టి చేరినంత వరకు ఉన్న దానిని దహించివేసేది; అది సమస్త సృష్టి; ఎందుకంటే పరిశుద్ధుడు మరియు సర్వోన్నతుడైన ఆయన దృష్టి సమస్త సృష్టిని చుట్టుముట్టి ఉంది.فوائد الحديث
మహోన్నతుడైన అల్లాహ్ నిద్రపోవడం అసాధ్యమనే స్పష్టీకరణ; ఎందుకంటే నిద్ర లోపాలకు చెందినది, మరియు ఆయన లోపాల నుండి పరిశుద్ధుడు.
అల్లాహ్ తఆల తాను తలచుకున్న వారికి గౌరవాన్ని ప్రసాదిస్తాడు మరియు తాను తలచుకున్న వారిని అవమానపరుస్తాడు, మరియు తన దాసులలో నుండి తాను తలచుకున్న వారికి మార్గనిర్దేశం చేస్తాడు మరియు తాను తలచుకున్న వారిని మార్గభ్రష్టులను చేస్తాడు.
ప్రతి రోజు మరియు ప్రతి రాత్రి ఆచరణలు అల్లాహ్‌కు సమర్పించబడతాయి, మరియు ఇందులో దాసులు తమ రాత్రింబవళ్ళలో అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండాలనే ప్రోత్సాహం ఉంది.
ఈ హదీథు పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క న్యాయాన్ని మరియు ఆయన తన సృష్టి వ్యవహారాల యొక్క ఉత్తమ నిర్వహణను రుజువు చేస్తుంది. మరియు నిస్సందేహంగా ఇది ఆయన పరిపూర్ణత యొక్క గుణగణాలలో ఒకటి, ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు.
'హిజాబ్' (అడ్డుతెర) అనే గుణం పరిశుద్ధుడైన అల్లాహ్ తఆలా కొరకు నిరూపితమైంది. అది ఆయనకు మరియు ఆయన సృష్టికి మధ్య అడ్డుగా ఉన్న ప్రకాశవంతమైన కాంతి. అది గనక లేకపోతే, సృష్టి మొత్తం దహించబడి పోయేది.
అల్ అజుర్రీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “సత్యవంతులైన ప్రజలు సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను, ఆ విధంగానే వర్ణిస్తారు ఏవిధంగానైతే ఆయన తనను తాను వర్ణించుకున్నాడో; ఆ విధంగానే వర్ణిస్తారు ఏవిధంగానైతే ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహ వసల్లం ఆయనను వర్ణించినాడో; మరియు ఆ విధంగానే వర్ణిస్తారు ఏవిధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు ఆయనను వర్ణించినారో. ఇది ధర్మ పండితులు అనుసరించిన సిద్ధాంతం, వారు కొత్తగా దీనిని ఆవిష్కరించలేదు, కొత్తగా తీసుకుని రాలేదు.” అహ్లుస్సున్నహ్ యొక్క విధానము ఇదే. అల్లాహ్ తన నామములను, తన గుణవిశేషాలను ఏమని స్థిరపరిచినాడో, అహ్ల్’స్సున్నహ్ ధర్మపండితులు వాటి అర్థాలను వక్రీకరించడం, మార్చడం చేయకుండా (తహ్’రీఫ్ చేయకుండా); వాటి అర్థాలను నిరాకరించడం, లేదా తిరస్కరించడం చేయకుండా (తావీల్ చేయకుండా), వాటి అర్థాలను “ఎలా?” అని ప్రశ్నించడం లేదా “ఇలా అయి ఉంటుంది” అని ఊహాగానాలు చేయడం లాంటిది చేయకుండా (తక్’యీఫ్ చేయకుండా); మరియు అల్లాహ్ యొక్క పేర్లు, ఆయన గుణవిశేషాలను ఆయన సృష్ఠితాలతో పోలిక ఇవ్వడం, పోల్చి చూపుతూ వివరించడం లాంటిది చేయకుండా (తమ్’సీల్ చేయకుండా) వాటిని అల్లాహ్ స్థిరపరిచినట్లుగానే స్థిరపరుస్తారు. అల్లాహ్ తనకు సంబంధించి ఏ విషయాలను తిరస్కరించినాడో, వారు ఆ విషయాలన్నింటినీ తిరస్కరిస్తారు; మరియు అల్లాహ్ చేత తిరస్కరించబడని, లేదా స్థిరపరచబడని విషయాల పట్ల వారు (అహ్లుస్సున్నహ్ పండితులు) మౌనంగా ఉంటారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తనను గురించి ఇలా అన్నాడు “లైస కమిథ్’లిహి షైఉన్, వహువస్సమీఉల్ బసీర్” (ఆయనను పోలినది ఏదీలేదు. మరియు ఆయన సర్వం వినువాడు, సర్వం చూచువాడు.)
సర్వశక్తిమంతుడైన ఆయన యొక్క గుణమైన కాంతి, ఆయన తనలో తాను దాచుకున్న కాంతి కంటే వేరుగా ఉన్నది. ఆయన తనలో తాను దాచుకున్న కాంతి సృష్టించబడిన కాంతి. కాబట్టి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క కాంతి ఆయనకు మరియు ఆయన స్వరూపానికి తగిన కాంతి. ఆయనను పోలినది ఏదీ లేదు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసినది అల్లాహ్ మరియు ఆయన దాసుల మధ్య ఉండే తెర మాత్రమే.
