“మీలో ఎవరికీ భయం లేదా – ఒకవేళ అతడు (నమాజులో) ఇమాం కంటే ముందు తల పైకి ఎత్తితే అల్లాహ్ అతడి తలను గాడిద తలగా…

“మీలో ఎవరికీ భయం లేదా – ఒకవేళ అతడు (నమాజులో) ఇమాం కంటే ముందు తల పైకి ఎత్తితే అల్లాహ్ అతడి తలను గాడిద తలగా చేస్తాడని లేక అతడి ఆకృతిని గాడిద మాదిరిగా చేస్తాడని?”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరికీ భయం లేదా – ఒకవేళ అతడు (నమాజులో) ఇమాం కంటే ముందు తల పైకి ఎత్తితే అల్లాహ్ అతడి తలను గాడిద తలగా చేస్తాడని లేక అతడి ఆకృతిని గాడిద మాదిరిగా చేస్తాడని?”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తీవ్రమైన హెచ్చరికను గురించి ఈ విధంగా విశదీకరిస్తున్నారు: ఎవరైతే (నమాజులో) తన ఇమాము కంటే ముందు తల పైకి ఎత్తుతాడో అల్లాహ్ అతడి తలను గాడిద తలగా మారుస్తాడు, లేక అతడి రూపాన్ని గాడిదకు మాదిరిగా మారుస్తాడు.

فوائد الحديث

ఇమామును అనుసరించే వానికి సంబంధించి నాలుగు పరిస్థితులను చూడవచ్చు, వాటిలో మూడు నిషేధము. అవి ఇమాముతో పోటీ పడుతున్నట్లుగా ఆచరించడం, ఇమాముతో పాటుగా ఆచరించడం, లేదా ఆచరించడంలో బాగా ఆలస్యం చేయడం. ఇవి మూడు కూడా నిషేధమే. ఇమాము వెనుక నమాజు ఆచరించే వానికి అనుమతించబడిన విషయం ఏమిటంటే – ఇమామును అనుసరించడం.

కనుక నమాజులో ఇమాము వెనుక ఉన్న నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ఇమామును అనుసరించుట అతనిపై విధి (ఇమాము ఆచరించిన ‘పిదప’, ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించుట).

ఇందులో – ఇమాము కంటే ముందు తల పైకి ఎత్తే వాని తలను లేదా ఆకారాన్ని గాడిద తల మాదిరిగా లేక గాడిద ఆకారం మాదిరిగా మార్చడం అనే తీవ్రమైన హెచ్చరిక ఏదైతే ఉన్నదో – అలా జరగడం అన్నివిధాలా సాధ్యమే; అతడు అలా రూపాంతరం చెందిన వాడు అవుతాడు.

التصنيفات

ఇమామ్ మరియు ముఖ్తదీల ఆదేశాలు