అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్…

అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి). సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

నమాజులో చివరి (రకాతులో) తషహ్హుద్ పూర్తి అయిన తరువాత, సలాముతో నమాజు ముగించుటకు ముందు నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ దుఆ చేసేవారు; మరియు మనలను కూడా ఆ నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరమని ఆదేశించినారు. మొదటిది: సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్) రెండవది: నరకాగ్ని శిక్ష నుండి (మిన్ అజాబిన్నార్). అది పునరుత్థానన దినమున జరుగుతుంది. మూడవది: ఈ జీవితపు సంక్షోభాలు, పరీక్షలనుండి – అంటే నిషేధిత వాంఛల నుండి, నిషేధిత విషయాల ఆకర్షణల నుండి రక్షణ, అలాగే తప్పుదారి పట్టించే సందేహాలనుండి రక్షణ; మరియు మరణము యొక్క పరీక్షల నుండి – అంటే, మరణ ఘడియ ఆసన్నమైనపుడు కలిగే మరణ వేదన నుండి రక్షణ, అలాగే ఇస్లాం నుండి మరియు సున్నత్ నుండి దూరంగా తీసుకుని వెళ్ళే విషయాలనుండి రక్షణ, మరియు సమాధిలో దైవదూతల ప్రశ్నల నుండి రక్షణ. నాలుగవది: ‘అల్ మసీహిద్దజ్జాల్’ యొక్క ఉపద్రవం నుండి రక్షణ. మసీహిద్దజ్జాల్ ఉపద్రవం ఈ ప్రపంచపు అంతిమ ఘడియలలో సంభవిస్తుంది. ఈ ఉపద్రవం ద్వారా అల్లాహ్ తన దాసులను పరీక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్ మసీహిద్దజ్జాల్’ యొక్క ఉపద్రవాన్ని మిగతా వాటితో కలిపి కాకుండా ప్రత్యేకంగా పెర్కొన్నారు – కారణం ఈ ఉపద్రవం తీసుకువచ్చే మార్గభ్రష్ఠత్వం, అరాచకం చాలా పెద్దద్ది కావడమే.

فوائد الحديث

ఈ హదీసులో పేర్కొనబడిన విధంగా అల్లాహ్ యొక్క రక్షణ కోరడం అనేది దుఆలలో అతి ముఖ్యమైనది, ఎందుకంటే ఈ దుఆలో ఈ ఇహలోకపు మరియు పరలోకపు ఉపద్రవాలు, శిక్షలు మరియు పరీక్షలనుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరడం జరుగుతున్నది.

ఇందులో సమాధి శిక్ష ఉన్నది అనడానికి రుజువు ఉన్నది, మరియు అది (సమాధి శిక్ష) సత్యము.

అలాగే ఇందులో వ్యామోహాల ప్రమాదము గురించి, మరియు వాటి నుండి తప్పించుకోవడానికి అల్లాహ్ యొక్క రక్షణ కోరుట యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుస్తున్నది.

ఇందులో ఈ ప్రపంచపు అంతిమ దినములలో ‘దజ్జాల్’ రావడం సత్యము అనడానికి, మరియు అతడి రాక వల్ల ఉద్భవించే ఉపద్రవం, మార్గభ్రష్ఠత్వం చాలా పెద్ది అనడానికి రుజువు ఉన్నది

నమాజులో చివరి తషహ్హుద్ తరువాత ఈ దుఆ పఠించడం అభిలషణీయము.

అలాగే ఏదైనా సత్కార్యము (మంచి పని) చేసిన వెంటనే ఈ దుఆ పఠించుట కూడా అభిలషణీయము.

التصنيفات

నమాజ్ దఆలు