“కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి

“కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి. ఒక మనిషి ఉదయం విశ్వాసిగా ఉంటాడు, సాయంత్రానికి అవిశాసిగా మారిపోతాడు; లేక అతడు సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు, ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు. ప్రాపంచిక లాభం కోసం అతడు తన ధర్మాన్ని అమ్మేస్తాడు”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసిని మంచి పనులను చేయడం వేగవంతం చేయమని మరియు మంచి పనులు చేయడం అసాధ్యమయ్యే పరిస్థితులు రాకముందే వాటిని వీలైనంత ఎక్కువగా చేయమని ప్రోత్సహిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు అతనిలో సందేహాలను రేకెత్తిస్తాయి, వాటి నుండి అతడి ధ్యానాన్ని మళ్ళిస్తాయి. అతని స్థితి ఎలా ఉంటుందంటే దట్టమైన చీకటి లాగా ఉంటుంది. అటువంటి స్థితిలో సత్యమూ, అసత్యమూ కలగాపులగం అయిపోయి, ప్రజలకు వాటి మధ్య భేదాన్ని కనుగొనుట కష్టమైపోతుంది. అటువంటి పరిస్థితుల తీవ్రత కారణంగా వ్యక్తి పూర్తిగా అయోమయ పరిస్థితిలో పడిపోయి ఈ లోకంలోని తాత్కాలిక ఆనందాల కోసం తన ధర్మాన్ని వదిలి వేసి, ఉదయం విశ్వాసిగా ఉన్న అతడు, సాయంత్రం అవిశ్వాసిగా మారిపోతాడు, మరియు సాయంత్రం విశ్వాసిగా ఉన్న అతడు ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా ధర్మానికి కట్టుబడి ఉండడం విధి అని, మరియు అవరోధాలు వచ్చి అడ్డుకోకముందే మంచి పనులు చేయడంలో త్వరపడాలని తెలుస్తున్నది.

ఈ హదీసులో పేర్కొనబడిన విషయం ప్రపంచం అంతమయ్యే చివరి దినాలలో వరుసగా వచ్చి పడే కష్టాలకు, అరాచక ఘటనలకు సంకేతం. అప్పుడు ఒక కష్టం తీరిపోతుందో లేదో వెంటనే మరో కష్టం వచ్చిపడుతుంది.

ఒక వ్యక్తి ధర్మానుసరణలో బలహీనపడి, అతను డబ్బు లేదా ఇతర వస్తువుల వంటి ప్రాపంచిక విషయాలకు బదులుగా దానిని వదులుకుంటే, అది అతడు ధర్మమార్గము నుండి మార్గభ్రష్ఠుడు కావడానికి, ధర్మాన్ని విడిచిపెట్టడానికి మరియు ప్రలోభాలకు దారితీయడానికి కారణం అవుతుంది.

సత్కార్యాలు ప్రలోభాల నుండి విమోచనానికి చేర్చే కారణాలలో ఒకటి అని ఈ హదీసు ద్వారా నిరూపణ అవుతున్నది.

“ఫిత్నహ్” (ఆకర్షణ, కష్టము, అరాచకత్వము మొ.) రెండు రకాలు. సందేహాల ‘ఫిత్నహ్’: దీనికి చికిత్స జ్ఞానము. వాంఛల ‘ఫిత్నహ్’: దీనికి చికిత్స బలమైన విశ్వాసము మరియు సహనము, ఓర్పు.

ఎవరైతే తక్కువగా మంచిపనులు చేస్తారో, అటువంటి వారు తేలికగా ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ఎవరైతే ఎక్కువగా మంచిపనులు చేస్తారో వారు తాము చేసిన మంచి పనులను చూసుకుని మోసపోరాదని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది.

التصنيفات

విశ్వాసము యొక్క భాగాలు