“మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట,…

“మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: “మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మములోని ఐదు స్వాభావిక ఆచరణల గురించి తెలియ జేసినారు. ఇవి గతించిన ప్రవక్తల సున్నత్’లోని భాగముగా కూడా ఉండేవి. వాటిలో మొదటిది: ‘అల్ ఖితాన్’ (సుంతీ) – అంటే పురుషులలో శిశ్నాగ్రమును కప్పుతూ వదులుగా ఉండే చర్మాన్ని కత్తిరించుట, అలాగే స్త్రీలలో సంభోగపు ప్రదేశానికి (యోనికి) పై భాగాన ఉండే యోని శీర్షాన్ని కత్తిరించుట. రెండవది: ‘అల్’ఇస్తిహ్’దాద్’ – అంటే జననాంగాలపై మరియు జననాంగాల పరిసరాలలో మొలిచే వెంట్రుకలను తొలగించుట. మూడవది: మీసాలను కత్తిరించుట (కురుచవిగా చేయుట). నాలుగవది: గోళ్ళు కత్తిరించుట. ఐదవది: చంకలలోని వెంట్రుకలు తొలగించుట.

فوائد الحديث

ఇందులో అల్లాహ్ ఇష్టపడే ప్రవక్తల సున్నతుల యొక్క ప్రస్తావన ఉన్నది. వాటి పరిపూర్ణత కొరకు, తద్వారా స్వీయ సౌందర్యము (పరిశుద్ధత) కొరకు వాటిని ఆచరించమని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు.

ఈ హదీసులో - ఈ విషయాలను ఆచరణలో పెట్టాలని, వాటిని నిర్లక్ష్యం చేయరాదనే సూచన ఉన్నది.

ఈ ఆచరణలలో ప్రాపంచిక ప్రయోజనాలు మరియు ధార్మిక ప్రతిఫలాలు ఉన్నాయి. ఉదాహరణకు రూపము సౌందర్యవంతమగుట, శారీరక పరిశుభ్రత, పరిశుద్ధతల గురించి అప్రమత్తంగా మరియు సావధానంగా ఉండుట, (ఈ విషయాలలో) అవిశ్వాసులను వ్యతిరేకించుట, మరియు అల్లాహ్ యొక్క ఆదేశపాలన చేయుట.

ఈ హదీసులో పేర్కొన్న ఐదు గాక వేరే హదీసులలో సహజసిద్ధ (స్వాభావిక) ఆచారాలు / ఆచరణలుగా అదనంగా మరికొన్ని ఆచారాలను / ఆచరణలను పేర్కొనుట జరిగినది – అవి గడ్డము పెంచుట, పలుదోము పుల్ల (మిస్వాక్’) ఉపయోగించుట మొదలైనవి.

التصنيفات

ప్రకృతి మార్గాలు