“మీలో ఎవరైనా (నిద్రలో) ఏదైనా కల చూసినట్లయితే, మరియు ఒకవేళ అది మీకు ఇష్టమైన కల అయినట్లయితే, అది అల్లాహ్ తరఫు నుంచి…

“మీలో ఎవరైనా (నిద్రలో) ఏదైనా కల చూసినట్లయితే, మరియు ఒకవేళ అది మీకు ఇష్టమైన కల అయినట్లయితే, అది అల్లాహ్ తరఫు నుంచి (అని భావించాలి); అందుకు మీరు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి, ఆయన ఘనతను కొనియాడాలి మరియు ఇతరులకు తెలియజేయాలి. మరి ఒకవేళ మీకు వచ్చిన కలను మీరు ఇష్టపడనట్లయితే, అది షైతాను తరఫు నుంచి (అని భావించాలి), అందుకు మీరు అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దానిని ఇతరులకు తెలియజేయకూడదు. ఎందుకంటే అది మీకు ఎలాంటి హానీ కలుగజేయదు.”

అబీ సయీద్ అల్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నారు: “మీలో ఎవరైనా (నిద్రలో) ఏదైనా కల చూసినట్లయితే, మరియు ఒకవేళ అది మీకు ఇష్టమైన కల అయినట్లయితే, అది అల్లాహ్ తరఫు నుంచి (అని భావించాలి); అందుకు మీరు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి, ఆయన ఘనతను కొనియాడాలి మరియు ఇతరులకు తెలియజేయాలి. మరి ఒకవేళ మీకు వచ్చిన కలను మీరు ఇష్టపడనట్లయితే, అది షైతాను తరఫు నుంచి (అని భావించాలి), అందుకు మీరు అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దానిని ఇతరులకు తెలియజేయకూడదు. ఎందుకంటే అది మీకు ఎలాంటి హానీ కలుగజేయదు.”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: కలలో ఏదైనా మంచి విషయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విషయాన్ని చూసినట్లయితే అది అల్లాహ్ తరఫు నుండి అవుతుంది. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు – అందుకు బదులుగా మీరు అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించండి, ఆయనకు కృతఙ్ఞతలు తెలియజేయండి, మరియు దానిని ఇతరులకు తెలియజేయండి. ఒకవేళ కలలో ఏదైనా చెడు విషయాన్ని అంటే బాధకు, విచారానికి గురిచేసే విషయాన్ని చూసినట్లయితే, అది షైతాను తరఫు నుండి అవుతుంది. అందుకు మనం అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దాని గురించి ఇతరులకు తెలియజేయరాదు, ఎందుకంటే అది మనకు ఎటువంటి హాని కలుగజేయదు; అల్లాహ్ ఇందులో పేర్కొనబడిన విషయాన్ని, అటువంటి చెడు కల నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు ఆయన శరణు వేడుకోవడానికి ఒక కారణంగా చేసినాడు.

فوائد الحديث

కలల రకాలు: 1 – మంచి కల: ఇది సత్యమైన కల, అల్లాహ్ తరఫు నుండి అతడు చూసే శుభవార్త అవుతుంది, లేక అతని కొరకు మరొకరు చూసినది అయి ఉంటుంది. 2 – ఇది అతడు మేల్కొని ఉన్నపుడు స్వయంగా మాట్లాడుకున్న విషయాలు; 3 – ఆదాము కుమారుని దుఃఖపెట్టడానికి, భయపెట్టడానికి, భయాందోళనలకు గురిచేయడానికి మరియు అతనికి దుఃఖాన్ని కలిగించడానికి షైతాను చేసే ప్రయత్నము.

ఈ హదీథులో మంచి కలను గురించి ప్రస్తావించబడిన దాని ఆధారంగా, మంచి కలను చూసిన వ్యక్తి మూడు పనులు చేయాలి: అల్లాహ్ యొక్క ఘనతను స్తుతించాలి, కీర్తించాలి; దానిని ఒక మంచి శకునంగా తీసుకోవాలి; మరియు దానిని గురించి తాను ఇష్టపడే వారితో చర్చించాలి; తాను ఇష్టపడని వారితో మాట్లాడరాదు.

(షరియత్’లో) ఇష్టపడని కలను గురించి చెప్పబడిన విషయాల సారాంశములో ఈ ఐదు విషయాలు ఉన్నాయి: ఆ కల యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క సంరక్షణ, శరణు వేడుకోవాలి; మరియు షైతాను యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క సంరక్షణ, శరణు వేడుకోవాలి; అతడు నిద్ర మేల్కుంటే తన ఎడమ వైపునకు మూడు సార్లు (సూచన ప్రాయంగా) ఉమ్మివేయాలి; ఆ కలను గురించి ఎవరికీ తెలియజేయ రాదు మరియు అతడు మరలా పడుకోవాలి అనుకుంటే, అతడు ఏ వైపునకు తిరిగి పడుకుని ఉండగా ఆ చెడు కల వచ్చిందో అటు వైపునకు కాకుండా మరో వైపునకు తిరిగి పడుకోవాలి, అపుడు ఎటువంటి కీడూ కలుగదు.

ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: తాను చూసిన మంచి కలను గురించి తాను ఇష్టపడని వారికి తెలియజేయరాదు అని అనడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటంటే, ఆ వ్యక్తి ద్వేషం లేదా అసూయ కారణంగా ఆ మంచి కలను గురించి చెడుగా అతడు ఇష్టపడని విధంగా వ్యాఖ్యానించవచ్చు; ఒక్కోసారి అది అతడు వ్యాఖ్యానించినట్లుగానే జరుగవచ్చు; లేదా అతని చెడు వ్యాఖ్యానం వల్ల ఆ కల చూసిన వ్యక్తి విచారానికి, దుఃఖానికి లోను కావచ్చు. కావున తాను చూసిన మంచి కలను గురించి తాను ఇష్టపడని వారికి చెప్పవద్దని ఆదేశించబడింది.

మంచిని చూసినపుడు (మంచి కలను చూసినపుడు) అల్లాహ్’ను కొనియాడడం, ఆయన ఘనతను కీర్తించడం, ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుకోవడం కలలోని ఆ మంచి యొక్క కొనసాగింపునకు దారి తీస్తుంది.

التصنيفات

కల పద్దతులు