“ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్…

“ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.”

అబీ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబీ హురైరహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒక విశ్వాసికి (ముస్లిమునకు) ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, కష్టం, హాని లేదా వేదన కలిగినా, పస్తులు ఉండవలసి వచ్చినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా – అది అతని పాపాలకు పరిహారంగా మారుతుంది, మరియు అతని కొరకు పాపాలనుండి ఉపశమనంగా పరిణమిస్తుంది.

فوائد الحديث

ఇందులో విశ్వాసులైన తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క కృప, ఆయన యొక్క కరుణ మరియు అనుగ్రహం తెలుస్తున్నాయి. ఇహలోక జీవితంలో దాసునిపై వచ్చిపడే కష్టాలు, తద్వారా (నరక శిక్షతో పోలిస్తే) అతనికి కలిగే అతి తక్కువ బాధ కారణంగా ఆయన అతని పాపాలను క్షమిస్తాడు.

ఒక విశ్వాసి (ముస్లిం) ఈ ఇహలోక జీవితంలో అతనిపై ఏ కష్టం వచ్చిపడినా దాని ద్వారా అతడు అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని కోరుకోవాలి; అది చిన్నదైనా, లేక పెద్దదైనా అన్నింటిపై సహనం వహించాలి, తద్వారా అతడు (తీర్పు దినమున) తన స్థానములో వృద్ధినీ, మరియు తన పాపములకు పరిహారాన్నీ పొందుతాడు.

التصنيفات

తౌహీద్ ప్రామఖ్యతలు