“ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి, మా వద్దకు వచ్చినారు. మేము ఆయనతో “ఓ రసూలల్లాహ్!…

“ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి, మా వద్దకు వచ్చినారు. మేము ఆయనతో “ఓ రసూలల్లాహ్! నిశ్చయంగా మీకు సలాం ఎలా చేయాలో మీరు మాకు నేర్పినారు. అయితే మీపై శాంతి, శుభాలకొరకు ఏమని పలకాలి?

అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ అబూ లైలా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను క’అబ్ ఇబ్న్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ను కలవడం జరిగింది. ఆయన “నేను నీకు ఒక బహుమతి ఇవ్వనా?” అన్నాడు. “ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి, మా వద్దకు వచ్చినారు. మేము ఆయనతో “ఓ రసూలల్లాహ్! నిశ్చయంగా మీకు సలాం ఎలా చేయాలో మీరు మాకు నేర్పినారు. అయితే మీపై శాంతి, శుభాలకొరకు ఏమని పలకాలి?” అని అన్నాము. దానికి ఆయన “మీరు ఇలా పలకండి – ‘అల్లాహుమ్మ, సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లయిత అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్; అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్, వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్’ (ఓ అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శాంతిని కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శాంతిని కురిపించినావో, నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు; ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో. నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

(సలాహ్ లో) “అత్తహియ్యాతు లిల్లాహి” పఠించే క్రమంలో “అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని పఠించి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు సలాం ఏ విధంగా చేయాలో నేర్చుకున్న తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహబా – వారిపై శాంతి, శుభాలు కలగాలని ప్రార్థించుటకు ఏమని పలకాలి అని వారిని ప్రశ్నించారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనపై శాంతి, శుభాలు కలగాలని ప్రార్థించు విధానాన్ని, మరియు పలకాలో, దాని అర్థంతో సహా వారికి తెలియజేసారు. “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్” (ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతిని కురిపించు, మరియు ఆయన కుటుంబము పై శాంతిని కురిపించు) అంటే దాని అర్థము: ఆయనను ఉత్తమమైన ప్రశంసలతో ఉత్తముల సమావేశాలలో (దైవదూతల సమావేశాలలో) ప్రస్తావించుట మరియు ఆయన ధర్మాన్ని అనుసరించిన వారిని గురించి, మరియు వారి దగ్గరి బంధువులలో విశ్వాసులైన వారి గురించి కూడా. “కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ” (ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం (అలైహిస్సలాం) పై మరియు ఆయ కుటుంబీకులపై శాంతిని కురిపించినావో) అంటే – ఏవిధంగానైతే నీవు ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబానికి నీవు నీ అనుగ్రహాన్ని అందించినావో – అంటే ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్’హాఖ్, మరియు వారి వారసులు, మరియు వారి నమ్మకమైన అనుచరులు (విశ్వాసులు), కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మీ దయను, అనుగ్రహాన్ని ప్రసరింపజేయి. “ఇన్నక హమీదుమ్మజీద్” (నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు) అంటే దాని అర్థము: (ఓ అల్లాహ్!) నీవు స్వయంగా నీ ఉనికిలో, నీ గుణాలలో మరియు నీ చర్యలలో ప్రశంసించదగినవాడవు, మరియు నీ గొప్పతనం, అధికారం మరియు దాతృత్వంలో సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాప్తి చెందినవాడవు. “అల్లాహుమ్మ, బారిక్ అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం , వ అలా ఆలి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కమా బారక్త, అలా ఇబ్రామీమ్ వ ఆలి ఇబ్రాహీమ్” (ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం పై మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో) అంటే దాని అర్థము: ఆయనకు శుభాలలో ప్రతి శుభాన్ని ప్రసాదించు, మహోన్నతమైన గౌరవాన్ని ప్రసాదించు, దానిని మరింతగా వృధ్ది గావించు, మరియు దానిని స్థిరపరుచు.

فوائد الحديث

సలఫ్ సాలిహీన్’లు (సహాబాలు, తాబయీన్ మరియు అత్తబ్బ అత్తాబయీన్) వాస్తవానికి వారు జ్ఞానానికి సంబంధించిన విషయాలలో ఒకరికొకరు మార్గదర్శకం చేసుకుంటూ ఉండేవారు.

సలాహ్’లో చివరి తషహ్హుద్’లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి శుభాలు కురిపించమని ప్రార్థించడం విధి అని ఈ హదీథు ద్వారా తెలుస్తున్నది.

సలాహ్ ఆచరణలో తనకు సలాం చేయు విధానాన్ని, మరియు తనపై శాంతి శుభాలు కలగాలని ప్రార్థించే విధానాన్ని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు బోధించినారు.

(ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన) ఈ సూత్రం, సలాహ్’లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం పై దరూద్ పంపేందుకు అత్యంత సంపూర్ణమైన సూత్రం.

التصنيفات

నమాజ్ దఆలు, బోధకుని,శిష్యుని పద్దతులు