“ఏదైనా పరిమళ ద్రవ్యము (ఉదా: అత్తరు) బహుమతిగా ఇవ్వబడితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడూ నిరాకరించేవారు…

“ఏదైనా పరిమళ ద్రవ్యము (ఉదా: అత్తరు) బహుమతిగా ఇవ్వబడితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడూ నిరాకరించేవారు కాదు”

అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఏదైనా పరిమళ ద్రవ్యము (ఉదా: అత్తరు) బహుమతిగా ఇవ్వబడితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడూ నిరాకరించేవారు కాదు”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకాలలో ఇది ఒకటి – ఎపుడైనా వారికి అత్తరు బహుమతిగా ఇవ్వబడితే వారు దానిని నిరాకరించేవారు కారు. అత్తరు ఎక్కువ బరువు కూడా ఉండదు, మరియు పరిమళ భరితంగానూ ఉంటుంది.

فوائد الحديث

ఇందులో పరిమళ భరిత ద్రవ్యాలు (ఉదా: అత్తరు) బహుమతిగా ఇవ్వబడితే దానిని స్వీకరించుట అభిలషణీయము అని తెలుస్తున్నది. ఎందుకంటే అది ఆహార ధాన్యాల వంటిది కాదు మోసుకు వెళ్ళడానికి, మరియు అది దానమో, దాతృత్వమో కాదు స్వీకరించకుండా ఉండడానికి.

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వపు సంపూర్ణత, ఉత్తమమైన నడవడిక తెలుస్తున్నాయి – వారు అత్తరు మొ. పరిమళద్రవ్యాలను నిరాకరించేవారు కాదు, అది ఎవరి నుంచి బహుమతిగా ఇవ్వబడినా సరే.

అలాగే ఇందులో సుగంధ ద్రవ్యాలను, పరిమళ ద్రవ్యాలను వినియోగించాలనే ప్రోత్సాహము ఉన్నది.

التصنيفات

సందర్శనం మరియు అనుమతికోరే పద్దతులు