పునరుత్థాన దినాన అల్లాహ్ వద్ద అతి కఠినమైన శిక్ష, సృష్టి కర్తగా (ఆయన చేసే పనిని) ఆయనను అనుకరించే వారికి ఉంటుంది

పునరుత్థాన దినాన అల్లాహ్ వద్ద అతి కఠినమైన శిక్ష, సృష్టి కర్తగా (ఆయన చేసే పనిని) ఆయనను అనుకరించే వారికి ఉంటుంది

ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి) ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చారు. ఇంటిలో ఒక బీరువా లాంటిది ఉన్నది, దానిపై నేను సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినాను. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. ఆయన దానిని చూస్తూనే చించి వేసారు. ఆయన ముఖము రంగు మారింది. ఆయన “ఓ ఆయిషా! పునరుత్థాన దినాన అల్లాహ్ వద్ద అతి కఠినమైన శిక్ష, సృష్టి కర్తగా (ఆయన చేసే పనిని) ఆయనను అనుకరించే వారికి ఉంటుంది” అన్నారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు “మేము దానిని ముక్కలుగా చించివేసి దానితో ఒకటో, రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉన్న చోటుకి వెళ్ళారు. అక్కడ ఒక సామానులు పెట్టుకునే బీరువాలాంటిది ఉన్నది, దానిపై ఆమె సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినారు. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. అల్లాహ్ కోసం కోపంతో ఆయన ముఖపు రంగు మారిపోయింది, మరియు ఆయన దానిని (ఆ తెరను) తీసివేసారు. ఆయన ఇలా అన్నారు: “ప్రళయ దినాన అత్యంత కఠినమైన శిక్షను అనుభవించే వ్యక్తులు ఎవరంటే తాము చిత్రించిన చిత్రాలతో అల్లాహ్ యొక్క సృష్టిని అనుకరించటానికి ప్రయత్నించేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు: “మేము దానితో ఒకటో లేక రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము."

فوائد الحديث

చెడును చూసిన వెంటనే దానికి ఖండించాలి, నిరాకరించాలి, అలా చేయడంలో అలసత్వం వహించరాదు; లేకపోయినట్లయితే అది గొప్ప నష్టాన్ని కలుగజేయగలదు.

పునరుత్థాన దినాన, చేసిన పాప కార్యము యొక్క తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది.

జీవరాసుల చిత్రాలను చిత్రించడం “కబాయిర్”లలో (పెద్ద పాపములలో) ఒకటి.

బొమ్మలు, చిత్రాలు, విగ్రహాలు తయారు చేయడాన్ని నిషేధించడం వెనుక ఉన్న ఒక హేతుబద్ధత ఏమిటంటే, అల్లాహ్ యొక్క సృష్టిని అనుకరించడం, వాటిని తయారుచేసే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసినా, చేయకపోయినా.

వస్తువులలో షరియత్ నిషేధించిన వాటి ఉనికి ఏమైనా ఉన్నట్లయితే, వాటిని తొలగించిన తరువాత ఆ వస్తువులను ఉపయోగం లోనికి తీసుకుని రావచ్చును. ఆ విధంగా ఆ వస్తువులపై చేసిన ఖర్చును, తద్వారా సంపదను రక్షించడం పట్ల షరియత్ శ్రద్ధ వహిస్తుంది.

ఏ రూపంలోనైనా జీవుల చిత్రాలను తయారు చేయడం నిషేధించబడింది; ఆ చిత్రాలు వాటిని లేక వారిని విమర్శించడానికి, అగౌరవ పరచడానికి రూపొందించినవి అయినా సరే.

التصنيفات

తౌహీదె రుబూబియ్యత్