“ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు…

“ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశద పరుస్తున్నారు: ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తాను పలుకని మాటలను తన మాటలుగా, తాను ఆచరించని ఆచరణను తన ఆచరణగా తనకు ఆపాదించినట్లయితే – అతడు తనను గురించి అసత్యం పలుకుతున్నాడు. తీర్పు దినమున అటువంటి స్థానము నరకాగ్నిలో ఉంటుంది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అసత్యం పలికినందుకు గాను అతనికివ్వబడే ప్రతిఫలం.

فوائد الحديث

నరకాగ్నిలోనికి వేయబడడానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను గురించి ఉద్దేశ్యపూర్వకంగా అసత్యాలు పలకడం అనేది కూడా ఒక కారణం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గురించి అసత్యాలు పలకడం అనేది మిగతా ఎవరి గురించి అయినా అసత్యం పలకడంతో సమానం కాదు. ఎందుకంటే ఆయనను గురించి అసత్యం పలకడం ధర్మములో (ఇస్లాం లో) మరియు ప్రపంచములో గొప్ప ఉపద్రవాన్ని సృష్టిస్తుంది.

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథులను, వాటి ప్రామాణికతను ధృవీకరించుకొనక ముందే వాటిని ప్రచురించరాదు మరియు వ్యాపింప జేయరాదు అనే హెచ్చరిక ఉన్నది.

التصنيفات

సున్నత్ ప్రాముఖ్యత మరియు దాని స్థానం., దుర్గుణాలు