‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో) అనే ఆయతు అవతరించనంత…

‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో) అనే ఆయతు అవతరించనంత వరకు సూరాలు (దివ్య ఖుర్’ఆన్ లోని అధ్యాయాలు) ఎక్కడ అంతమవుతాయనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎరుగరు

అబుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో) అనే ఆయతు అవతరించనంత వరకు సూరాలు (దివ్య ఖుర్’ఆన్ లోని అధ్యాయాలు) ఎక్కడ అంతమవుతాయనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎరుగరు.

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా వివరిస్తున్నారు: దివ్య ఖుర్’ఆన్ లోని సూరాలు (అధ్యాయాలు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడినాయి. అయితే అవతరణ జరుగుతున్నపుడు అవి ఎక్కడ వేరవుతాయి, వాటి చివరలు ఏమిటీ అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియదు. ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ అవతరిస్తే అపుడు వారికి తెలిసేది అంతకు ముందు సూరా ముగిసినది అని, కొత్త సూరహ్ ప్రారంభమైనది అని.

فوائد الحديث

సూరహ్ అల్ అన్’ఫాల్ మరియు సూరహ్ అత్-తౌబహ్ – ఈ రెండు సూరాలు తప్ప ‘బస్మలహ్’ (బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం ను బస్మలహ్ అంటారు) మిగిలిన అన్ని సూరాలను వేరుపరుస్తుంది.

التصنيفات

ఖుర్ఆన్ అవతరణ మరియు దాని శేకరణ, ఖుర్ఆన్ శేకరణ