ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో…

ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” అని ప్రశ్నించినారు. అపుడు నేను “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా గుండెలపై తట్టి “అల్లాహ్ ఙ్ఞానాన్ని నీ కొరకు ఆహ్లాదకరమైనదిగా చేయుగాక ఓ అబుల్ ముందిర్!” అన్నారు”

ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు ఉల్లెఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించినారు: “ఓ అబుల్ ముందిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునకు బాగా తెలియును” అన్నాను. అందుకు ఆయన తిరిగి “ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” అని ప్రశ్నించినారు. అపుడు నేను “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా గుండెలపై తట్టి “అల్లాహ్ ఙ్ఞానాన్ని నీ కొరకు ఆహ్లాదకరమైనదిగా చేయుగాక ఓ అబుల్ ముందిర్!” అన్నారు”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్న్ కాబ్ రజియల్లాహు అన్హు ను, దివ్య ఖుర్’ఆన్ లో ఏ ఆయతు అన్నింటి కన్నా అత్యుత్తమమైనది మరియు ఘనమైనది? అని ప్రశ్నించినారు. దానికి ఆయన సమాధానం చెప్పడానికి మొదట తటపటాయించినా, చివరికి “అది ఆయతుల్ కుర్సీ - అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు ఙ్ఞానవంతుడు అన్నట్లు, ఆయన చెప్పిన సమాధానాన్ని బలపరుస్తున్నట్లు ఆయన గుండెలపై తట్టినారు. తరువాత ఆయన ఙ్ఞానము చూసి తాను సంతోషపడినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు కొరకు అల్లాహ్’తో దువా చేసినారు.

فوائد الحديث

ఇందులో ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు కొరకు అత్యంత ఘనమైన ప్రతిఫలం మరియు ప్రశంస ఉన్నాయి.

అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఆయతుల్ కుర్సీ ఒక గొప్పదైన మరియు ఘనమైన ఆయతు. కనుక ఆ ఆయతును కంఠస్థము చేసి, ధారణలో నిలుపుకోవాలి.

التصنيفات

సూరాలు మరియు ఆయతుల ప్రాముఖ్యతలు., జ్ఞానము ప్రాముఖ్యత