“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”

“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”

జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధిగా ఆచరించవలసిన నమజులను వదిలివేయుట గురించి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక (ముస్లిం) వ్యక్తికి మరియు అతడు బహుదైవారాధనలో, అవిశ్వాసములో పడిపోవడానికి మధ్య ఉన్న భేదం ఏమిటంటే అతడు నమాజును వదిలివేయడం. ఇస్లాం మూలస్థంభాలలో ‘సలాహ్’ (నమాజు) రెండవ మూలస్థంభము. ఇస్లాంలో నమాజు యొక్క ప్రాముఖ్యత, ఘనత మరియు ఔన్నత్యము చాలా గొప్పవి. ముస్లిములందరి ఏకాభిప్రాయము ప్రకారము – ఎవరైతే నమాజు ఆచరించుట విధి అనే విషయాన్ని విశ్వసించడో మరియు నమాజు ఆచరించుటను వదిలివేస్తాడో అతడు అవిశ్వాసానికి పాల్బడిన వాడిగా పరిగణించబడతాడు. అలాగే ఎవరైనా సోమరితనం కారణంగా, లేక నిర్లక్ష్యము కారణంగా నమాజు ఆచరించుటను పూర్తిగా వదిలివేసినట్లయితే – అలాంటి వాడు కూడా అవిశ్వాసిగా పరిగణించబడతాడు. ఈ విషయముపై సహాబాల ఏకాభిప్రాయము నమోదు చేయబడి ఉన్నది. ఒకవేళ ఎవరైనా కొన్నిసార్లు ఆచరిస్తూ, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే అతడు తీవ్రమైన హెచ్చరిక పరిధిలో ఉన్నాడని అర్థము.

فوائد الحديث

ఇందులో నమాజు యొక్క ప్రాముఖ్యత, మరియు నమాజులను వదలకుండా ఆచరించుట యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నాయి; కారణము – అది విశ్వాసానికి మరియు అవిశ్వాసానికి మధ్య భేదమును తెలుపునటువంటిది కనుక.

అలాగే ఇందులో నమాజులను వదిలివేయుట, మరియు వాటిని నిర్లక్ష్యము చేయుట గురించి అతి తీవ్రమైన హెచ్చరిక ఉన్నది.

التصنيفات

నవాఖిజుల్ ఇస్లాం (ఇస్లాంను విరగగొట్టేవి), అవిశ్వాసం (కుఫ్ర్), నమాజ్ యొక్క అనివార్యమవటం మరియు దాన్ని వదిలే వాడి ఆదేశము