జిల్హిజ్జా మాసపు మొదటి పది రోజులు

జిల్హిజ్జా మాసపు మొదటి పది రోజులు

1- “ఈ దినములలో చేసే సత్కార్యాలు (అంటే జిల్ హిజ్జహ్ నెల మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు) మిగతా ఏ దినములలో చేసే సత్కార్యాల కన్నా కూడా అల్లాహ్’కు అత్యంత ప్రియమైనవి.”* (వింటున్న) వారు ఇలా ప్రశ్నించినారు: “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కంటే కూడా గొప్పవా?” దానికి ఆయన “అవును, అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కూడా (ఈ పది దినములలో చేసే సత్కార్యాల కన్నా) గొప్పది కాదు; అయితే తన ప్రాణాన్ని, తన సంపదను వెంట తీసుకుని జిహాదు కొరకు వెళ్ళి, ఆ రెండింటిలో ఏ ఒక్క దానితోనూ వెనుకకు తిరిగి రాని వాని జిహాదు తప్ప” అన్నారు.