“డెబ్భై సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి నరకము లోనికి విసిరి వేయబడింది. అది అలా (నరకము యొక్క అడుగు భాగం…

“డెబ్భై సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి నరకము లోనికి విసిరి వేయబడింది. అది అలా (నరకము యొక్క అడుగు భాగం వైపునకు) జారుతూనే ఉంది. ఇప్పుడు అది నరకపు అడుగు భాగాన్ని తాకింది.” అన్నారు.”

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఉండగా ఒక భయంకరమైన శబ్దం విన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అది (ఆ శబ్దము) ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు. మేము “అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాత్రమే బాగా ఎరుగును” అని అన్నాము. దానికి ఆయన (స) “డెబ్భై సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి నరకము లోనికి విసిరి వేయబడింది. అది అలా (నరకము యొక్క అడుగు భాగం వైపునకు) జారుతూనే ఉంది. ఇప్పుడు అది నరకపు అడుగు భాగాన్ని తాకింది.” అన్నారు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత కలవర పరిచేలా, ఏదో వస్తువు పడిపోయినట్లు పెద్ద శబ్దం విన్నారు. వారితో పాటు అక్కడే ఉన్న సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) ఆ శబ్దాన్ని గురించి అడిగారు. దానికి వారు ‘అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాత్రమే బాగా ఎరుగుదురు’ అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారితో ఇలా అన్నారు: మీరు విన్న ఈ శబ్దం డెబ్బై సంవత్సరాల క్రితం నరకం అంచు నుండి విసిరిన రాయి, నరకపు దిగువకు చేరుకునే వరకు పడిపోతూ పడిపోతూ, నరకం అడుగున తాకినపుడు చేసిన ఆ శబ్దాన్ని మీరు విన్నారు.

فوائد الحديث

ఈ హదీథులో సత్కార్యాలు ఎక్కువగా చేస్తూ అంతిమ దినము కొరకు తయారు కావాలనే హితబోధ, మరియు నరకం పట్ల హెచ్చరిక ఉన్నాయి.

మానవుడు తనకు ఙ్ఞానం లేని విషయాలలో – వాటికి సంబంధించిన జ్ఞానాన్ని అల్లాహ్’కు ఆపాదించడం అభిలాషణీయమైన విషయం.

ఉపాధ్యాయుడు విషయాన్ని వివరించే ముందు విద్యార్థులలో ఆసక్తిని, శ్రద్ధను పెంపొందించాలి, తద్వారా అది మంచి అవగాహనకు దారితీసే అవకాశం ఉంటుంది.

التصنيفات

స్వర్గము,నరకము యొక్క లక్షణాలు