అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: …

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుదూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుదూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుదూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుదూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధత అనేది సలాహ్ ఆచరించుట కొరకు ఒక షరతు అని తెలుపుతున్నారు. కనుక ఎవరైతే సలాహ్ ఆచరించాలని సంకల్పిస్తాడో, అతడు అంతకు ముందు వుదూను భంగ పరిచే పనులలో దేనికైనా పాల్బడి ఉంటే, అతడు సలాహ్ ఆచరించడానికి వుదూ చేయుట అతని కొరకు విధి అవుతుంది.

فوائد الحديث

హదస్ అల్ అక్బర్ స్థితిలో (పెద్ద హదస్: గుసుల్ తప్పనిసరిగా చేయవలసి ఉన్న స్థితి) ఉన్న వ్యక్తి, గుసుల్ ఆచరించి, అలాగే హదస్ అల్ అస్గర్ స్థితిలో (చిన్న హదస్: వుదూ తప్పనిసరిగా చేయవలసిన స్థితి) ఉన్న వ్యక్తి వుదూ చేసి తనను తాను పరిశుద్ధ పరచుకోనంత వరకు అతని సలాహ్ అంగీకరించబడదు.

వుజూ అంటే – నోటిలోనికి నీళ్ళు తీసుకుని, బాగా పుక్కిలించి ఉమ్మి వేయాలి, తరువాత ముక్కులోనికి నీళ్ళు ఎక్కించి శుభ్రంగా చీదేయాలి, ముఖాన్ని మూడు సార్లు కడగాలి, తరువాత రెండు చేతులను మోచేతుల సమేతంగా మూడు సార్లు కడగాలి, తరువాత తడి చేతులతో తలను ఒకసారి తడమాలి, తరువాత అతడు కాళ్ళను చీలమండల సమేతంగా మూడు సార్లు కడగాలి.

التصنيفات

వజూ