: . . .

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్బియ ఇలా ఉండేది: "లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక, లబ్బైక లా షరీక లక లబ్బైక, ఇన్నల్ హమ్ద వన్ని'మత లక వల్ ముల్క్, లా షరీక లక్." ("హాజరయ్యాను, ఓ అల్లాహ్! నేను హాజరయ్యాను, నీకు భాగస్వామి లేడు, నేను హాజరయ్యాను. నిశ్చయంగా సకల ప్రశంసలు కృతజ్ఞతలు, అనుగ్రహాలు, సార్వభౌమాధికారం అన్నీ నీకే శోభిస్తాయి; నీకు భాగస్వామి లేడు)." ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇంకా ఇలా జోడించేవారు: "లబ్బైక లబ్బైక, వ స'దైక, వల్ ఖైరు బియదైక్. లబ్బైక వ రఘ్బా ఇలైక వల్ అమల్." ("నేను నీ పిలుపుకు హాజరయ్యాను, నేను హాజరయ్యాను. నన్ను సంతోషపెట్టమని కోరుతున్నాను. సర్వమైన మంచి నీ చేతుల్లోనే ఉంది. నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను. ఆశలు, కృషి అన్నీ నీ వైపే."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జ్ లేదా ఉమ్రహ్ ఆరంభించేటప్పుడు ఇలా తల్బియ పలికేవారు: (ఓ అల్లాహ్! నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను, నేను స్పందిస్తున్నాను) — నువ్వు మమ్మల్ని పిలిచిన ప్రతిదానికీ, దానిలో నిజాయితీ, ఏకేశ్వరవాదం (తౌహీద్), హజ్జ్ మరియు ఇతర అన్ని మంచి పనులు ఉన్నాయి, వాటన్నిటిలోను నేను నీ పిలుపుకు మళ్లీ మళ్లీ స్పందిస్తున్నాను; (నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను, నీకు భాగస్వామి లేడు, నేను స్పందిస్తున్నాను) — నీవే ఆరాధనకు అర్హుడు, నీ దైవత్వంలో, ఆరాధనలో, పేర్లలో, లక్షణాలలో నీకు భాగస్వామి లేడు; (నిశ్చయంగా, సకల ప్రశంసలు) — ప్రశంస, కృతజ్ఞత, గొప్పతనం అన్నీ నీకే; (దయ) — దయ కూడా నీవే ప్రసాదించేవాడు; (నీదే) — ఈ ప్రశంస, కృతజ్ఞత, దయ అన్నీ ఎల్లప్పుడూ నీకే అంకితం, శోభిస్తాయి;(అధికారం కూడా నీదే) — ప్రపంచంలోని అధికారం, రాజ్యం నీదే; (నీకు భాగస్వామి లేడు) — ఈ అన్నిటిలోను నీవే ఏకైకుడవు; నీకు ఎవరూ భాగస్వామి లేరు. ఇంకా ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తల్బియ్యాలో ఇలా జోడించేవారు: (నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను, నేను నీ పిలుపుకు మళ్లీ మళ్లీ స్పందిస్తున్నాను, నన్ను సంతోషపరచమని కోరుతున్నాను) అర్థం: నన్ను ఎప్పటికప్పుడు సంతోషంగా ఉంచు, నీ దయతో నన్ను ఆనందపరచు. (మంచి అన్నీ నీ చేతుల్లోనే ఉంది) అర్థం: సర్వమైన మంచి నీదే, నీ కృప వల్లే అది లభిస్తుంది. (నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను, ఆశలు నీవైపే ఉన్నాయి) అర్థం: మన ఆశలు, మన కోరికలు, మన అవసరాలు అన్నీ నీదే; నీవే వాటిని నెరవేర్చగలవు. (మరియు చర్యలు) అర్థం: ఆరాధన, సేవ, సత్కార్యాలు—నీ కోసమే చేయబడతాయి, ఎందుకంటే నీవు మాత్రమే ఆరాధనకు అర్హుడవు.

فوائد الحديث

హజ్జ్ మరియు ఉమ్రహ్ విషయాలలో తల్బియా పలకడం అనేది ఒక ప్రత్యేక ఆచరణ మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగిన సున్నతు. ఇది ఈ రెండు ఇబాదతులలో పలికే ప్రత్యేకమైన పలుకు.

ఇబ్నుల్ మునీర్ వ్యాఖ్యానం ప్రకారం, తల్బియ చెప్పడం అనేది అల్లాహ్ తన దాసులకు ఇచ్చే గౌరవాన్ని, ఆయన వారి పట్ల చూపే ప్రత్యేకతను హైలైట్ చేస్తుంది. హజ్జ్ లేదా ఉమ్రహ్ కోసం అల్లాహ్ ఇంటికి (బైతుల్లాహ్ కు) రాబోతున్న ప్రతి యాత్రికుడు, అసలు ఆ పిలుపు (హజ్జ్ లేదా ఉమ్రహ్ చేసే అవకాశం) అల్లాహ్ స్వయంగా ఇచ్చిన ఆహ్వానం అని గుర్తుచేస్తుంది

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్బియాను పాటించడం ఉత్తమం. అయితే, ప్రవక్త న ఆమోదించినట్లుగా సహాబాలు (ఉదా: ఇబ్ను ఉమర్) జోడించిన పదాలను కూడా వేరుగా పలకడం తప్పు కాదు. ఇబ్ను హజర్ ఇలా అన్నారు: ఇది అత్యంత సమతుల్యమైన మార్గం. ప్రవక్తకు నేరుగా ఆపాదించబడిన (మర్ఫూఅ్) తల్బియాను వేరుగా చదవాలి.

సహాబాలు జోడించిన (మౌఖూఫ్) పదాలు లేదా తానే కలుపుకున్న తగిన పదాలు వేరుగా చెప్పాలి, అవి మర్ఫూఅ్ తల్బియ్యాలో కలిపి చెప్పకూడదు. ఇది తషహ్హుద్‌లో చేసే దువా తరహాలోనే: తషహ్హుద్ ముగిసిన తర్వాత, తనకు నచ్చిన దువాలు, ప్రశంసలు వేరుగా వేడుకోడం అనుమతించబడినట్లే, తల్బియాలో కూడా ఇదే విధంగా పాటించాలి.

పురుషులు తల్బియా (లబ్బైక)ను గొంతెత్తి స్పష్టంగా పలకడం సిఫార్సు చేయబడింది. అయితే, మహిళలు తమ స్వరం తక్కువగా ఉంచాలి, ఎందుకంటే ఇతరులకు ఆకర్షణ కలిగించే ప్రమాదం సంభవించ వచ్చు.

التصنيفات

ఇహ్రామ్ ఆదేశాలు