నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే…

నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో. కనుక ఎవరి 'హిజ్రత్' కేవలం అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని కొరకు చేయబడుతుందో, ఆ హిజ్రత్ కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆయన సందేశహరుని కొరకు చేసినదిగా భావించబడుతుంది. ఎవరి హిజ్రత్ ఈ ప్రపంచపు సౌఖ్యాలను, సదుపాయాలను పొందడానికి లేదా ఏ స్త్రీనైనా వివాహం చేసుకోవడానికి చేయబడుతుందో, అతని హిజ్రత్ దాని కొరకు చేసిన హిజ్రత్ గానే భావించబడుతుంది, దేని కొరకైతే అతడు సంకల్పించినాడో." (హిజ్రత్ - తన స్వస్థలాన్ని లేక స్వదేశాన్ని వదిలి పూర్తిగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళిపోవుట). బుఖారీ గ్రంథములో ఈ పదాలున్నాయి: ""నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో".

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఆచరణలు అన్నీ వాటి వెనుక ఉండే సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ఈ నియమం సాధారణంగా ఆచరణలు అన్నింటికీ వర్తిస్తుంది – అవి ఆరాధనలకు సంబంధించిన ఆచరణలు గానీ లేక సాధారణ వ్యవహారాలకు సంబంధించిన ఆచరణలు గానీ. కనుక ఎవరైనా తాను చేసే పని ద్వారా ఏదైనా ప్రయోజనం లేదా లాభం పొందాలని సంకల్పించి ఉంటే, అతనికి ఆ ప్రయోజనం తప్ప పుణ్యఫలం ఏమీ లభించదు. అలాగే ఎవరైనా తాను చేసే పని కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సామీప్యం పొందే, ఆయన కరుణ పొందే సంకల్పము తో చేసి ఉంటే, అతనికి దాని ప్రతిఫలం మరియు పుణ్యఫలం లభిస్తాయి, అది తినడం లేక తాగడం లాంటి సాధారణ ఆచరణ అయినా సరే. ఆచరణలలో ‘సంకల్పము’ యొక్క ప్రాధాన్యత మరియు దాని ప్రభావాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ ద్వారా విశదీకరిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల ‘హిజ్రత్’ (తన స్వస్థలాన్ని వదిలి శాస్వతంగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళుట) బాహ్యంగా చూడడానికి ఒకేలా కనిపించినా – ఎవరైతే కేవలం తన ప్రభువైన అల్లాహ్ యొక్క సంతుష్ఠి కొరకు, ఆయన సామీప్యం మరియు కరుణ పొందుటకు వలస వెళ్ళిపోవాలని సంకల్పిస్తాడో, అది షరియత్’కు అనుగుణంగా చేయబడిన ‘హిజ్రత్’ (వలస) గా స్వీకరించబడుతుంది. అతని సంకల్పములోని స్వచ్ఛత కారణంగా అతడికి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే, ఎవరైతే తాను చేసే హిజ్రత్ (వలస వెళ్ళిపోవుట) ద్వారా ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం పొందుట సంకల్పించి ఉంటే, అంటే ఉదాహరణకు ధనం సంపాదించుట కొరకు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుట కొరకు, లేదా వ్యాపారం కొరకు, లేదా ఆ ప్రదేశపు స్త్రీని వివామాడుట కొరకు సంకల్పించి ఉంటే, అతడికి అతడు ఆశించిన ప్రయోజనం తప్ప మరేమీ లబించదు. హిజ్రత్ పుణ్యఫలంలో అతడికి ఏమాత్రమూ భాగం ఉండదు.

فوائد الحديث

నిశ్చయంగా అల్లాహ్, మన ఆచరణలలో కేవలం ఆయన కొరకు (ఆయన కరుణ, కృప ఆశించి) చేసే ఆచరణలను మాత్రమే స్వీకరిస్తాడు. కనుక వాటిలో స్వచ్ఛత, నిజాయితీ కలిగి ఉండాలనే ప్రోద్బలం, ఉద్బోధ కనిపిస్తుంది ఇందులో.

మహోన్నతుడూ, సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే ఆచరణలను (ఉదాహరణకు, సత్కార్యాలు, మంచి పనులు), ఏదైనా నిర్బంధం కారణంగానో లేదా అలవాటుగానో ఆచరించినట్లయితే, వాటికి గానూ అతడికి పుణ్యఫలం ఏమీ లభించదు, అందులో అల్లాహ్ యొక్క సామీప్యము, ఆయన కరుణ, కృప పొందే సంకల్పము లేనంతవరకు.

التصنيفات

హృదయాల ఆచరణలు