“నిశ్చయంగా, అల్లాహ్ వద్ద న్యాయవంతులు (గా గుర్తించబడిన వారు) , అపార కరుణామయుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుని కుడి…

“నిశ్చయంగా, అల్లాహ్ వద్ద న్యాయవంతులు (గా గుర్తించబడిన వారు) , అపార కరుణామయుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుని కుడి చేతి వైపున కాంతితో చేయబడిన ఉన్నత ఆసనాలపై ఆశీనులై ఉంటారు. ఆయన రెండు చేతులు కూడా కుడి చేతులే

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం – “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా, అల్లాహ్ వద్ద న్యాయవంతులు (గా గుర్తించబడిన వారు) , అపార కరుణామయుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుని కుడి చేతి వైపున కాంతితో చేయబడిన ఉన్నత ఆసనాలపై ఆశీనులై ఉంటారు. ఆయన రెండు చేతులు కూడా కుడి చేతులే. వారు (ఆ న్యాయవంతులు), తమ తీర్పులలో, తమ కుటుంబాల పట్ల మరియు తమ సంరక్షణలో ఉన్న వారి పట్ల న్యాయముతో వ్యవహరిస్తారు”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే ప్రజల మధ్య సత్యము మరియు న్యాయము ఆధారంగా తీర్పు చేస్తారో అంటే ఎవరైతే తమ శాసనం క్రింద ఉన్నారో వారిపట్ల, ఎవరైతే తమ అధికారం క్రింద ఉన్నారో వారి పట్ల, వారి కుటుంబాల పట్ల న్యాయంగా వ్యవహరిస్తారో, వారు తీర్పు దినమునాడు తమ గౌరవార్థం కాంతితో తయారు చేయబడిన ఉన్నత ఆసనాలపై అశీనులవుతారు” అని తెలియజేస్తున్నారు. ఆ ఉన్నతాసనాలు అనంత కరుణామయుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ యొక్క కుడి చేతివైపు పొందుపరచబడి ఉంటాయి. పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క రెండు చేతులూ కుడి చేతులే.

فوائد الحديث

ఇందులో – (ప్రజల మధ్య) న్యాయబధ్ధంగా, ధర్మబద్ధంగా తీర్పు చేయుట యొక్క ఘనత మరియు దానివైపునకు పిలుపు ఉన్నాయి.

“న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తీర్పు చేయుట” అనేది ఒక సాధారణత్వం కలిగిన వ్యక్తీకరణ. ఇందులో తన శాసనం క్రింద ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల పట్ల న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించుట, తన అధికారం క్రింద ఉన్న వారి పట్ల, చివరికి తన భార్యల పట్ల, తన సంతానం పట్ల న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించుట – మొదలైనవి అన్నీ వస్తాయి.

ఇందులో - తీర్పు దినమునాడు, ఆ విధంగా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించే వారి స్థానము, వారి ఔన్నత్యము యొక్క చిత్రణ కనిపిస్తున్నది.

తీర్పు దినము నాడు, విశ్వాసులకు వారి వారి ఆచరణల ఆధారంగా, వారికి ప్రసాదించబడే ఆవాసాలలో, వారికి ఇవ్వబడే స్థానాలలో వ్యత్యాసము ఉంటుందని తెలుస్తున్నది.

ఏదైనా విషయం వైపునకు కార్యోన్ముఖులను చేయు విధానాలలో, తద్వారా వారు పొందబోయే అపూర్వ బహుమానాల ప్రస్తావన చేయడం అనేది, వారిని విధేయత వైపునకు ప్రోత్సహిస్తుంది.

التصنيفات

సద్గుణాలు