“బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”

“బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”

జుబైర్ బిన్ ముత్’ఇం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు: “బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాలను త్రెంచుకునే వాని గురించి వివరిస్తున్నారు. ఎవరైతే తన బంధువులతో బంధుత్వాన్ని త్రెంచుకుంటాడో లేక వారి హక్కులను వారికి ఇవ్వకుండా ఉల్లంఘిస్తాడో లేక వారికి హాని కలిగించడం, వారితో అవమానకరంగా ప్రవర్తించడం చేస్తాడో, అటువంటి వాడు స్వర్గం’లో ప్రవేశించడానికి అర్హుడు కాడు.

فوائد الحديث

బంధువులతో బంధుత్వాలను త్రెంచుకోవడం ఘోరమైన పాపములలో (కబాయిర్ లలో) ఒకటి.

పేగు బంధము (రక్త సంబంధము) అనేది సాంప్రదాయలకు అనుగుణంగా నిర్వచించబడుతుంది. ఒక్కోసారి అది ప్రదేశాన్ని బట్టి, కాలమును బట్టి మరియు వ్యక్తులను బట్టి కూడా మారుతుంది.

బంధాలను గౌరవించడం, వాటిని నిర్వహించడం అంటే బంధువులను వారి వద్దకు వెళ్ళి కలుస్తూ ఉండడం, వారి యోగ క్షేమాలు విచారిస్తుండడం, వారు జబ్బు పడితే వెళ్ళి పరామర్శించడం, వారికి అవసర సమయాలలో సహాయం చేయడం, మంచి పనులలో వారికి తోడ్పాటు నందించడం, చెడు పనులనుండి వారిని నిరోధించడం మొదలైనవి.

బంధుత్వాన్ని త్రెంచుకోవడం ఘోరమైన పాపాలలో ఒకటి. అయితే, పాపము యొక్క తీవ్రత అతడు ఎంత దగ్గరి బంధువు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ బంధువు ఎంత దగ్గరి బంధువైతే పాపము యొక్క తీవ్రత అంత ఎక్కువ అవుతుంది.

التصنيفات

సద్గుణాలు మరియు పద్దతులు, సద్గుణాలు మరియు పద్దతులు, బంధుత్వాలను కలపటం యొక్క ప్రాముఖ్యతలు, బంధుత్వాలను కలపటం యొక్క ప్రాముఖ్యతలు