“ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు

“ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు

జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు".

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రజలపై కరుణ చూపని వానిపై సర్వోన్నతుడైన అల్లాహ్ కూడా కరుణ చూపడు అని వివరిస్తున్నారు. కనుక దాసుడు అల్లాహ్ యొక్క సృష్టితాలపై కరుణ చూపడం అనేది, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క కరుణ పొందే మార్గాలలో అత్యుత్తమమైన మార్గము.

فوائد الحديث

‘కరుణ చూపుట’ అనేది భూమిపై జీవించే జీవరాసులన్నింటికీ అవసరమైనదే. కానీ ఇందులో ‘జనులు’ ప్రత్యేకంగా పేర్కొన బడినారు (వారి పై కరుణ చూపడం ప్రత్యేకంగా పేర్కొనబడింది). అది గమనించ వలసిన విషయం.

అల్లాహ్ అనంత కరుణామయుడు. మరియు కరుణ కలిగి యున్న తన దాసులపై, అతని ఆచరణలను బట్టి ఆయన అతనిపై కరుణ చూపుతాడు.

ప్రజల పట్ల కరుణ కలిగి ఉండుటలో వారికి మంచి చేయుట, వారి నుండి చెడును, కీడును దూరం చేయుట, వారిని గౌరవించుట, ఆదరించుట మొదలైనవి అన్నీ ఉన్నాయి.

التصنيفات

సద్గుణాలు