“వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”

“వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”

అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”.

[దృఢమైనది] [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్ఠపరిచినారు – (వివాహ సమయమున) ఆమె తరఫున ఆమె సంరక్షకుడు ఉంటే తప్ప, ఒక స్త్రీ యొక్క వివాహము సక్రమమైనది కాదు. అతడే “వివాహపు కరారునామా” (Marriage Contract) ను నెరవేరుస్తాడు.

فوائد الحديث

వివాహము సక్రమమైనదిగా గుర్తించబడుటకు (వధువు తరఫున ఆమె వలీ) సంరక్షకుడుగా ఉండాలి అనేది తప్పనిసరిగా పాటించవలసిన వివాహపు షరతు. ఒకవేళ వలీ లేకుండా వివాహము జరిగినా, లేక వధువు (వలీ లేకుండా) తనే స్వయంగా వివాహము చేసుకున్నా అది సక్రమమైన వివాహముగా గుర్తించబడదు.

‘వలీ’ అంటే మగవారిలో వధువు యొక్క దగ్గరి బంధువు. కనుక, వధువు యొక్క దగ్గరి బంధువు ఉండగా, ఒక దూరపు బంధువు ‘వలీ’ గా వ్యవహరించి ఆమె వివాహము జరిపించజాలడు.

‘వలీ’ అర్హతలు (వలీగా వ్యవహరించుటకు నిబంధనలు): ‘ముకల్లిఫ్’ అయి ఉండాలి (ముకల్లిఫ్: యుక్తవయస్సు దాటి, మతిస్థిమితము కలిగి ఉన్న వాడు); మగవారు మాత్రమే వలీగా వ్యవహరించగలరు; వివాహానికి సంబంధించిన విషయాలన్నింటిని అవగాహన చేసుకోగల పరిపక్వత కలిగి ఉండాలి; వలీగా వ్యవహరించువారు – వలీకి మరియు వధువుకు మధ్య ధర్మానికి సంబంధించిన అన్ని నియమనిబంధనల అవగాహన కలిగి ఉండాలి.

التصنيفات

నికాహ్ (వివాహం)